బుధవారం తెల్లవారుజామును జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Fatal road accident)లో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మంత్రాలయం వేద పాఠశాల(Mantralayam Vedic school)కు చెందిన విద్యార్థులు(students) తుఫాన్ వాహనం(Tufan vehicle)లో రఘునందన తీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తుఫాన్ వాహనం రన్నింగ్‌లో పంచర్ కావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న విద్యార్థులతో పాటు డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వాసులుగా స్థానిక పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

































