జగన్ ఇంటి సీసీ కెమెరాలపై మరో ట్విస్ట్-వైసీపీ ఆఫీసుకు నోటీసులు..!

ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం మాత్రం ఏదో విధంగా వార్తల్లో ఉంటోంది.


గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల తాకిడితే తాడేపల్లి నివాసం వార్తల్లో నిలిచేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అధికార టీడీపీ, జనసేన నేతలు పలుమార్లు అక్కడికి వెళ్లి హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపింది.

ప్రస్తుతం జగన్ ఇల్లు కమ్ వైసీపీ కేంద్ర కార్యాలయంగా ఉన్న ప్రాంగణం బయట తాజాగా అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడ అదనంగా 8 కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో తాడేపల్లి పోలీసులకు వైసీపీ నేతలు ఆ రోజు ఏం జరిగిందో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు అప్పటికే అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ అడిగారు. దీంతో పాటు ఆరోజు సందర్శకుల వివరాలు కూడా కోరారు.

తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద 8 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే అక్కడ కెమెరాలు ఉండగా కొత్తగా వీటిని ఎందుకు ఏర్పాటు చేశారన్న చర్చ జరిగింది. కానీ ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వైసీపీ నేతలు తాజాగా పోలీసులకు తెలిపారు. వాటిలో ఫుటేజ్ రికార్డు లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారి వద్ద ఉన్న సందర్శకుల వివరాలు, ఇతర వివరాలతో ఇవాళ ఉదయం తాడేపల్లి పోలీసు స్టేషన్ కు రావాలని నోటీసులు పంపారు. దీంతో ప్రభుత్నం ఈ అగ్నిప్రమాదాన్ని కుట్ర కోణంలో చూస్తున్నట్లు అర్దమవుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.