HHVM: పవన్ కల్యాణ్ సాంగ్ సరికొత్త రికార్డు (వీడియో)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం(Hari Hara Veera Mallu Movie) నుంచి నిన్న రెండో పాట విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియోగా ఈ సాంగ్ నిలిచినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతికృష్ణ(Jyothi Krishna) సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత ఏఎమ్ రత్నం(AM Ratnam) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, సునీల్, నాజర్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే ఈ పాటను ఫోక్ సింగర్ మంగ్లీ, రాహుల్‌ సిప్లిగంజ్‌(Rahul Sipliganj), రమ్యా బెహరా, యామిని ఘంటశాల ఆలపించారు. చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి(MM Keeravani) సంగీతం అందించారు. ఈ పాటలో పవన్‌తో కలిసి హాట్ యాంకర్ అనసూయ(Anasuya), మరో నటి పూజిత పొన్నాడ స్టెప్పులేశారు. వచ్చే మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.