ఇటీవల విజయవాడలో ఒక మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. న్యాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన విజయవాడలో ఒక తల్లి, కూతురు విషం తాగారు.
ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
వివరాల్లోకి వెళితే, విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన ఒక మహిళ సెల్ఫీ రూపంలో తన బాధను వ్యక్తం చేసింది. “నా పేరు సుభాషిణి, నా కూతురు పేరు హాసిని.
నా భర్త నాగరాజు, కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం నిరంతరం తనను వేధిస్తున్నారని ఆమె బాధను వ్యక్తం చేసింది.
ఈ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఫలితం లేదు. ఇప్పుడు నేను, నా బిడ్డ విషం తాగి చనిపోతున్నాం” అని ఆమె ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది.

































