నేను లక్ష పెట్టుబడి పెట్టాను.. 80 కోట్లు సంపాదించాను.. అదృష్టం అంటే ఇదే బాస్.

జీవితంలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పలేం. అలానే ఎప్పుడెక్కడ, ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. 30 ఏళ్ల క్రితం ఓ తండ్రి పెట్టిన చిన్న పెట్టుబడి…


ఇప్పుడతని కొడుకుకు కోట్లాది విలువను తెచ్చిపెట్టింది. ఈ అద్భుత సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

1990లో పెట్టిన రూ.1 లక్ష.. 2025లో రూ.80 కోట్లు..

1990లో ఒక వ్యక్తి జిందాల్ గ్రూప్‌ నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో రూ.1 లక్ష విలువైన షేర్లను కొనుగోలు చేశాడు. కాలక్రమేణా వాటికి సంబంధించిన పత్రాలు కాస్త మర్చిపోయాడు. అవి ఇంట్లో ఓ మూలన నిలిపివేశాడు. ఇటీవల అతడి కొడుకు ఆ పాత పత్రాలను కాస్త ఆరా తీయగా ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ షేర్ల విలువ రూ.80 కోట్లు అని తేలడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఆనందాన్ని ఆపుకోలేక సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశాడు.

ఎక్స్ వేదికగా సౌరవ్ దత్తా అందుకు సంబంధించిన డాక్యుమెంట్ లను షేర్ చేయడంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు సైతం రెస్పాండ్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.