ఒక పాపులర్ హీరో కి సంబంధించిన టీజర్, లేదా ట్రైలర్ వచ్చినప్పుడు సోషల్ మీడియా లో అభిమానుల కోలాహలం ఎలా ఉంటుందో, దురాభిమానుల ట్రోల్స్ కూడా అదే విధంగా ఉంటాయి.
ముఖ్యంగా మెగా మరియు నందమూరి హీరోల సినిమాలకు సంబంధించినవి వస్తే సోషల్ మీడియా మొత్తం వారం రోజుల పాటు కళకళలాడిపోతూ ఉంటుంది. నేడు బాలయ్య(Nandamuri Balakrishna),బోయపాటి(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అఖండ 2′(Akhanda 2 Movie) మూవీ టీజర్ విడుదలైంది. ఒకపక్క నందమూరి అభిమానులు ఈ టీజర్ అద్భుతంగా ఉందంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటే, మరో పక్క ఇతర హీరోల అభిమానులు ట్రోల్స్ మీద ట్రోల్స్ వేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య మెడలో త్రిశూలం పెట్టుకొని తిప్పుతూ విలన్స్ ని నరికే సన్నివేశం అభిమానులకు బాగా నచ్చింది. కానీ ఇతరులకు మాత్రం ట్రోల్ స్టఫ్ గా మారింది. ఆ షాట్ పై సోషల్ మీడియా లో ఎన్నో ఫన్నీ ట్రోల్స్ వచ్చాయి.
బాలయ్య మెడలో త్రిశూలం ఫ్యాన్ లాగా తిరుగుతుంటే ఒక నెటిజెన్స్ దానికి ‘గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యానూ..నేను జగనన్న ఫ్యానూ’ అంటూ ఒక ఎడిట్ ని విడుదల చేసాడు. అది సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, జగన్ ఫ్యాన్స్ సైతం ఈ ఎడిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అదే విధంగా ‘చల్లని దర్మి కూల్’ అంటూ వచ్చే ఒక కమర్షియల్ యాడ్ ని ఎడిట్ చేస్తూ ‘అఖండ 2’ టీజర్ లోని కొన్ని షాట్స్ కలిపారు. అది కూడా బాగా వైరల్ అయ్యింది. ‘విశ్వంభర’ మూవీ టీజర్ విడుదల అయ్యినప్పుడు, ఆ టీజర్ లోని కొన్ని షాట్స్ తీసుకొని లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి ‘దెయ్యాల కోట’ అంటూ కొన్ని ఎడిట్స్ చేశారు. అప్పట్లో ఈ ఎడిట్స్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపింది. మెగా ఫ్యాన్స్ అందుకు రివెంజ్ తీర్చుకుంటూ ‘అఖండ 2’ టీజర్ పై కూడా అలాంటి ఎడిట్ ని దింపారు.
ఇది కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ మూడు వైరల్ వీడియోస్ ని క్రింద అందిస్తున్నాము, చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇదంతా పక్కన పెడితే చాలా రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ హిమాలయ పర్వతాల సమీపం లో జరుగుతూ వస్తుంది. పెహల్గామ్ ఉగ్ర దాడికి ముందు ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసినట్టు సమాచారం. ఓవరాల్ గా ఈ చిత్రం పై మొదటి నుండే అంచనాలు భారీ గా ఉండేవి, నేటి టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. సోషల్ మీడియా లో ట్రోల్స్ అనేవి ఏ చిత్రనికైనా సర్వసాధారణమే కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు.
































