వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)ని ఏపీ పోలీసులు బెంగళూరు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ (Bengaluru Airport Police Station)లో అదుపులోకి తీసుకున్నారు.
ఆయన్ను అక్కడి నుంచి ఏపీలోని మంగళగిరి (Mangalagiri)కి తరలించి, ఉదయాన్నే కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి పాస్ పోర్టును కర్ణాటక పోలీసులు ఏపీ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో చెవిరెడ్డి ఏ 38గా ఉన్నారు. చెవిరెడ్డితోపాటు అతని సన్నిహితుడు ఏ34 గా ఉన్న వెంకటేశ్ నాయుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా.. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిపై అభియోగాలు వస్తున్న క్రమంలో మంగళవారం ఉదయం బెంగళూరు నుంచ శ్రీలంక రాజధాని కొలంబో (Colombo) వెళ్లాల్సిన ఆయన్ను కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (Kempegouda International Airport)లో భద్రతా సిబ్బంది ఆపివేశారు. లుకౌట్ నోటీసులు (Lookout Notice) అమల్లో ఉండటంతో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూటమి ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తూన్న విషయం తెలిసిందే. ఈ స్కామ్ పై సెట్ అధికారులతో ప్రత్యేకంగా దర్యాప్తు చేయిస్తోంది. ఇందులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిలను కూడా సెట్ అరెస్ట్ చేసి విచారిస్తోంది.
































