మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్

మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కోల్‌కతా(Kolkata) నుంచి కొలంబో(Kolombo) వెళ్తుండగా ఆయనను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


ఏపీ(Ap)లో నమోదైన కేసులో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో కోల్‌కతా ఎయిర్ పోర్టులో కొడాలి నానిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులు హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నారు. అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో చేరారు. ఆ తర్వాత ఆయనకు గుండె సంబంధింత సర్జరీ చేశారు. ముంబైలో ఉన్నారని, త్వరలోనే రాష్ట్రానికి వస్తారని వైసీపీ నేతలు తెలిపారు. అయితే ఆయన కోల్ కతా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పని చేయిన కొడాలి నాని రెచ్చిపోయే మాట్లాడేవారు. ప్రతిపక్ష నాయకులను దూషించేవారు. దీంతో అప్పట్లోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంతకాలంగా కొడాలి నాని రాష్ట్రంలో ఉండకపోవడంతో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా తాజాగా కోల్ కతా ఎయిర్ పోర్టులో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.