ఇంట్లో మద్యం సేవించాలన్నా అనుమతులు తీసుకోవాలా…చట్టం అయితే అవుననే చెబుతోంది. ప్రొహిబిషన్ లేనప్పుడు ఇంట్లో మద్యం తాగేందుకు అనుమతి ఎందుకనే ప్రశ్న తలెత్తవచ్చు.
కానీ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే ఇంట్లో మద్యం బాటిళ్లు పెట్టుకునేందుకు ఓ పరిమితి ఉంది. ఆ పరిమితి దాటితే చర్యలు తప్పవు. అదేంటో చూద్దాం.
ఎక్సైజ్ శాఖకు సంబంధించి చాలా నిబంధనలు ఉన్నాయి. మందు బాబులు చాలామంది ఇళ్లలో మద్యం బాటిళ్లు స్టాక్ ఉంచుకుని చిన్న సైజు బార్ మెయింటైన్ చేస్తుంటారు. పెద్ద పెద్ద ఇళ్లలో అయితే ఇదొక స్టేటస్ సింబల్. అంటే బార్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయంటోంది. ప్రొహిబిషన్ లేదు కదా అని ఇంట్లో ఇష్టం వచ్చిన పరిమాణంలో మద్యం బాటిళ్లను స్టాక్ ఉంచుకునేందుకు వీలు లేదు. మరి ఎన్ని బాటిళ్ల మద్యం ఇంట్లో నిల్వ ఉంచవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియదు. అధికారికంగా కొనుగోలు చేస్తున్నాం కదా అని అనుకుంటారు. కానీ ఎక్సైజ్ నిబంధనలు అలా అనుమతించవు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలామంది మానలేరు. దాదాపు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. అందుకే మద్యం అమ్మకాలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంటున్నాయి. కొందరు బయట తాగుతుంటే మరి కొందరు ఇళ్లలోనే బార్ మెయింటైన్ చేస్తుంటారు. ప్రొహిబిషన్ లేకపోయినా ఇంట్లో మద్యం బాటిళ్లు పరిమితికి మించి ఉంచకూడదు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇంట్లో మద్యం తాగేందుకు లేదా స్టాక్ ఉంచుకునేందుకు కొన్ని పరిమితులున్నాయి.
నిబంధనల ప్రకారం ఇంట్లో మినీ బార్ నిర్వహించేందుకు వీలు లేదు. చాలామంది ఇళ్లలో ఇదే కన్పిస్తుంటుంది. అసలు ఇంట్లో మద్యం బాటిళ్లు కేవలం మూడుకు మించి ఉంచకూడదని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. అది డిఫెన్స్ మద్యమైనా లేక మద్యం దుకాణాల్లో లభించేది అయినా అంతే. కేవలం మూడు బాటిల్స్ మాత్రమే ఉంచుకోవాలి.
ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి ఇది మారుతుంటుంది. ఒక మనిషికి మూడు బాటిళ్ల వరకు ఉంచవచ్చు. అదే ఇంట్లో ముగ్గురు ఉంటే 9 బాటిళ్లు స్టోర్ చేసుకోవచ్చు. బిల్స్ కూడా పాడేయకుండా సిద్ధంగా ఉంచుకోవాలి.
అంతే తప్ప హోమ్ బార్ లేదా మినీ బార్ ఏర్పాటు చేసుకోవడం చట్టరీత్యా నేరం. తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. మద్యం తీసుకునేటప్పుడు చుట్టుపక్కలవారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇళ్లలో ఏదైనా ఫంక్షన్ ఉండి లిక్కర్ తీసుకునే పరిస్థితి ఉంటే మాత్రం ముందస్తుగా ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాల్సి ఉంటుంది. నిర్ణీత మొత్తం ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవాలి.
































