70 ఏళ్లు పైబడిన వారికి వెలకట్టలేని వరం.. రూ. 5 లక్షల ఉచిత బీమా.. 15 ముఖ్యమైన విషయాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ దేశంలోని 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకం ద్వారా ప్రతి సీనియర్ సిటిజన్ కుటుంబానికి రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం లభిస్తుంది.


కేంద్రం ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రకటనలు జారీ చేస్తోంది. ఈ సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకం యొక్క 15 ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PM-JAY బీమా పథకం యొక్క 15 ముఖ్యమైన అంశాలు:

1. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) అనేది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం.

2. తక్కువ ఆదాయ వర్గాల కోసం 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు.

3. PM మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 11న ఈ ఆరోగ్య బీమా పథకాన్ని ఆమోదించింది.

4. సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌పై ఆదాయపు పన్ను పరిమితి లేదు.

5. దేశంలో మొత్తం సీనియర్ సిటిజన్ల సంఖ్య 6.5 కోట్లు కాగా.. వారి కుటుంబాలు 4.5 కోట్లు.

6. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వైద్య బీమా అందించబడుతుంది.

7. వైద్య బీమా పొందుతున్న సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయబడుతుంది.

8. ఒకవేళ సీనియర్ సిటిజన్లు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారులు అయినప్పటికీ.. వారికి రూ.5 లక్షలకు ప్రత్యేక గుర్తింపు కార్డు అందించబడుతుంది.

9. ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉంటే.. రూ.5 లక్షల బీమాను పంచుకోవాలి.

10. ఈ పథకం కింద అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటాయి.

11. ఈ పథకంలో చేరిన వారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందవచ్చు.

12. ప్రైవేట్ కంపెనీ నుండి ఆరోగ్య బీమా ఉన్న సీనియర్ సిటిజన్లు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.

13. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పథకానికి మొత్తం రూ.3437 కోట్లు కేటాయించారు.

14. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ. లక్ష కోట్లకు పైగా ప్రయోజనం చేకూరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

15. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య సంరక్షణ పథకం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.