గోడ గడియారం ఈ దిశలో పెడితే.. డబ్బు, అదృష్టం, శాంతి పక్కా

ఇంట్లో గడియారం కేవలం సమయం చూపించే సాధనం మాత్రమే కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది మన ఇల్లు, జీవితం మొత్తం మీదనే ప్రభావం చూపగల శక్తివంతమైన సాధనం.


ఇంట్లో సరైన దిక్కులో వాల్ క్లాక్ పెట్టుకుంటే డబ్బు, సంతోషం, శాంతి వచ్చే అవకాశం ఉంటుంది. తప్పు దిక్కులో పెట్టితే దురదృష్టం, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వెంటాడతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.. కాబట్టి, గడియారం ఏ దిక్కున పెట్టాలి, ఏ దిక్కున పెట్టకూడదో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ కథనంలో దీని గురించి వివరాలు తెలుసుకుందాం.

ఉత్తర దిక్కు సంపదకు అధిపతి కుబేరుని స్థానం. ఈ దిక్కులో గడియారం పెట్టుకుంటే డబ్బు ప్రవాహంలా వస్తుందని వాస్తు పండితులు అంటున్నారు. కెరీర్‌లో పెరుగుదల, ఆర్థిక స్థిరత్వం అన్నీ ఈ దిశకు సూచిస్తుందని.. పైగా మెటల్, వైట్, సిల్వర్, గ్రే కలర్స్‌లో ఉన్న క్లాక్స్ పెడితే ఈ ప్రభావం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మీ ఇంట్లో గడియారం ఉత్తరం కుదరకపోతే తూర్పు పెట్టినా శుభప్రదమే. తూర్పు అంటే సూర్యుడి లేచే దిక్కు. ఇది ఆరోగ్యం, పాజిటివ్ ఎనర్జీ, మంచి ఆలోచనలు, సరికొత్త అవకాశాలు అందిస్తుందని వాస్తు చెబుతోంది. చెక్కతో చేసిన గడియారాలు లేదా లైట్ కలర్ క్లాక్స్ తూర్పు గోడపై అద్భుతం. ఏకాగ్రత పెరుగుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కుటుంబంలో సంతోషం విరాజిల్లుతుంది.

ఉత్తరం, తూర్పు వీలుకాకపోతే పడమర దిక్కు కూడా ఓ చక్కని ఆప్షన్. ఈ దిక్కుకు వరుణ దేవుడు అధిపతి.. గడియారం ఇక్కడ పెడితే మనశ్శాంతిని, స్థిరత్వాన్ని కాపాడుతుంది. బ్లాక్, వైట్, మెటాలిక్ షేడ్స్‌లో ఉన్న గడియారాలు పడమర గోడకు పర్ఫెక్ట్. ఈ దిశలో పెట్టిన క్లాక్ ఎమోషనల్ బ్యాలెన్స్‌ను కాపాడుతుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఇంట్లో గడియారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక దక్షిణ దిక్కున పెట్టకూడదంటారు.. కారణం ఆ దిక్కుకు అధిపతి యముడు. ఈ దిశలో గడియారం పెడితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఒత్తిడి తప్పవు. ఇంట్లో ప్రశాంతతకు లోపం వస్తుందని చెబుతున్నారు. అందుకే దక్షిణం వైపు గడియారం పెట్టకపోవడమే మేలని వాస్తు చెప్పుతోంది. అంతేకాదు గడియారం తలుపు మీద ఉంచకండి. ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీకి అడ్డంకి అవుతుంది. మంచానికి దగ్గరగా, అద్దానికి ఎదురుగా, బాత్రూమ్‌లో, డైనింగ్ రూంలో గడియారం పెట్టొద్దు. గడియారం టిక్ టిక్ శబ్దం అనవసరంగా టెన్షన్‌ను పెంచేస్తుంది. గడియారం ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. ఆగిపోతే దురదృష్టానికి ఆహ్వానం పంపినట్లే. బ్యాటరీ డౌన్ అయితే వెంటనే మార్చేయండి.

గడియారం రంగులు కూడా ముఖ్యమే అంటున్నారు పండితులు. లైట్ కలర్స్ వైట్, క్రీమ్, లైట్ గ్రే, స్కై బ్లూ, మెటాలిక్ కలర్ గడియారాలు మంచి ఫలితాలు ఇస్తాయి. రెడ్, డార్క్ కలర్స్ తప్పించాలి. ఇవి టెన్షన్‌ను పిలుస్తాయి. ఇక ఒక గదిలో చాలా గడియారాలు పెట్టకండి. కన్ఫ్యూజన్ తప్పదు. ఒక్క గడియారం సరైన ఎత్తులో, కంటికి సమానంగా ఉండాలి. అప్పుడే ఇల్లు ఎనర్జీతో నిండిపోతుంది. చివరిగా సమయం చెప్పే గడియారం… సరైన చోటే ఉంచితే అదృష్టం వరిస్తుందని పండితులు అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.