ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ దూరం.. రోజంతా పాజిటివ్​గా ఉండొచ్చు

ఉదయాన్నే నిద్రలేవడాన్ని ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకరంగా చెప్తారు. రోజు ఎలా మొదలవుతుందో.. రోజంతా అలాగే ఉంటుందని చెప్తారు.


అందుకే ఉదయాన్నే కొన్ని సానుకూలమైన పనులు చేయాలంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో, ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీపోతుందని భావిస్తారు.

రాత్రి నిద్ర తర్వాతే ఉదయం నిద్ర లేచిన వెంటనే సానుకూలంగా రోజు ప్రారంభించాలనుకుంటే కొన్ని అలవాట్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయట. మరి రోజును పాజిటివ్​గా మార్చుకోవడానికి చేయాల్సిన 5 పనులు ఏంటో.. వాటిని చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

భూమాతకి నమస్కారం..

ఉదయం లేచిన తర్వాత చేతులు జోడించి భూమాతను మంచి రోజు కోసం ప్రార్థించాలి. భూమిపై కాలు పెట్టడానికి ముందు భూమాతకు గౌరవం ఇవ్వడం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు. ఇది శాస్త్రాలలో కూడా ఈ ప్రస్తావన ఉంది. అయితే శాస్త్రాలపై అంత నమ్మకముంచని వారైతే.. గ్రాటీట్యూడ్​తో నిన్నకి థ్యాంక్స్ చెప్తూ.. ఈరోజు లేచినందుకు యూనివర్స్​కి థ్యాంక్స్ చెప్పొచ్చు.

నీటితో రోజు ప్రారంభం

ఉదయం లేచిన తర్వాత.. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. శరీరంలోని విషపూరిత పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేయడంతో పాటు హైడ్రేట్ చేస్తుంది. రాగిపాత్రలో నీరు అందుబాటులో లేకుంటే గోరువెచ్చని నీటిని అయినా ఓ గ్లాస్​లో తీసుకోవచ్చు. మలాసనలో కూర్చొని తాగితే మరీ మంచిది.

దీపం పెట్టండి..

ఉదయం లేచి.. మలమూత్ర విసర్జన తర్వాత, ఇళ్లు శుభ్రం చేసుకుని స్నానం చేయండి. ఇంట్లో పూజగదిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అలాగే ఉదయాన్నే లేచి ఇలా ఫ్రెష్ అవ్వడం వల్ల రోజంతా యాక్టివ్​గా ఉంటారు. బద్ధకం ఉండదు. కాబట్టి మీరు దీపం పెట్టకున్నా.. రోజూ ఇలాంటి రొటీన్​ని సెట్ చేసుకోండి. దీంతో పాటు మీరు ఇంట్లోనే సాంబ్రాణి దూపం కూడా వెలిగించుకోవచ్చు. ఇది మంచి సువాసనలు అందించి మీ మూడ్​ని మెరుగుపరుస్తుంది.

శంఖం లేదా గంట మోగిస్తే..

ఉదయం పూజ చేసిన తర్వాత.. శంఖం లేదా గంట మోగించడం వల్ల వాతావరణంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ధ్వని తరంగాలు సూక్ష్మ బ్యాక్టీరియా, ప్రతికూల శక్తిని నాశనం చేస్తాయని చెప్తారు. శాస్త్రీయంగా కూడా ఇది నిరూపితమైనది. అందుకే శబ్ధానికి సంబంధించి పలు చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. లేదంటే మీరు యూట్యూబ్లో గాయత్రి మంత్రం కూడా పెట్టుకోవచ్చు. లేదా మీకు మానసిక మనశ్శాంతిని అందించే మ్యూజిక్ పెట్టుకోవచ్చు.

మొక్కలకు నీరు పోయండి..

పూజ సమయంలో తులసి మొక్కకినీరుపోసిప్రదక్షిణచేయవచ్చు. లేదా మీరు పూజ చేయట్లేదు అనుకుంటే ఇంట్లో ఉన్న మొక్కలకు నీరు పోయడం, ఓ 5 నిమిషాలు గార్డెనింగ్ చేయడం వంటివి చేయాలి. ఇలా మొక్కలని తాకడం, వాటికి నీటిని పోయడం వల్ల మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

కాబట్టి ఉదయం లేచిన తర్వాత ఈ ఐదు అలవాట్లను ఫాలో అయిపోండి. దీనివల్ల మీ జీవితంలో ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా మానసిక శాంతి కూడా లభిస్తుంది. దీంతో రోజంతా యాక్టివ్​గా ఉంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.