తెలంగాణలో ఆ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ. 4 వేలు అకౌంట్లోకి

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోంది. రైతుల సంక్షేమం, అభివృద్ది మంత్రంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే రైతు భరోసా పథకం నిధుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం రికార్డు వ్యవధిలో విజయవంతంగా పూర్తిచేసింది రేవంత్ సర్కార్.


మొత్తం 69.39 లక్షల మంది రైతులకు గాను రూ.8,744.13 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. కేవలం 15 రోజుల్లోనే రైతు భరోసా నగదు పంపిణీని రికార్డు స్థాయిలో పూర్తి చేసింది.

అలాగే రాష్ట్రంలోని భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు జులై తొలి వారంలో నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 రెండు విడతల్లో ఇస్తామని ఇదివరకే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో విడతలో రూ.6,000 చొప్పున అకౌంట్లలో జమచేసేందుకు కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. హనుమకొండ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 10 క్లస్టర్ లను ఏర్పాటు చేశారు. అంతేకాక ఈ పథకం కింద సహజ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు ఒక్క ఎకరానికి రూ. 4 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1250 ఎకరాల్లో ఈ పథకం అమలు అవుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.