20 వేలు పెట్టుబడి. రోజుకి 8 గంటలే పని, నెలకు లక్ష వరకు సంపాదించే అవకాశం!

క్కువ పెట్టుబడి..ఎక్కువ లాభం…బిజినెస్ మొదలుపెట్టాలని ఆలోచించే ప్రతి ఒక్కరి లక్ష్యం ఇదే. కానీ వాస్తవంలో తక్కువ పెట్టుబడితో అన్ని వ్యాపారాలు చేయలేము.


అయితే ఫుడ్ బిజినెస్ దీనికి మినహాయింపు. తక్కువలో తక్కువ ఒక 20 వేలు పెట్టుబడితో కూడా దీని ప్రారంభించొచ్చు. సక్సెస్ అయితే లాభాలు బీభత్సంగా ఉంటాయి. అలాంటి రిస్క్ తక్కువుంటే ఒక ఫుడ్ బిజినెస్ స్కూల్ స్నాక్స్, ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయి ఇళ్ల దగ్గరే చేస్తున్న వ్యాపారం ఇది. దీనికి ఏమి కావాలి, పెట్టుబడి ఎంత, ఏమేం లైసెన్సులు అవసరం ఉంటాయో స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ మీ కోసం…

ఈ రోజుల్లో స్కూల్ కి వెళ్లే పిల్లలకు రోజూలంచ్ బ్రేక్ కంటే ముందే ఒక స్నాక్ బ్రేక్ ఉంటుంది. రోజు పిల్లలకు ఏమి స్నాక్స్ ఇవ్వాలి అనేది తల్లి తండ్రులకు ఒక పెద్ద తలనొప్పి. రోజుకొక వెరైటీ కావాలి, టేస్ట్ కూడా బాగుండాలి అందుకే స్నాక్స్ డబ్బా పెట్టటం అంటే తల్లిదండ్రులకు ఒక పెద్ద సమస్య. సూపర్ మార్కెట్లలో అనేక బ్రాండెడ్ స్నాక్స్ దొరుకుతున్నా అవి రేటు ఎక్కువ ఉండటం, ఎక్కువగా నార్త్ ఇండియా స్నాక్స్ దొరకటం తో అదో పెద్ద ఇబ్బంది. వారికి మీరు రుచికరమైన హెల్తీ స్నాక్స్ అమ్మగలిగితే….థింక్ ఒన్స్, ఈ బిజినెస్ లో ఎంతుందో… ఆల్రెడీ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ మధ్య ఈ స్నాక్స్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. ఎంత పెరిగిన పోటీ లేని వ్యాపారం ఇది కాబటికి హ్యాపీ గా టెన్షన్ లేకుండా తక్కువలో మొదలుపెట్టెయ్యొచ్చు. జస్ట్ ఒకటే రూల్…క్వాలిటీ!

ఏమి ఐటమ్స్ అయితే బెటర్:
ఇవే అమ్మాలనే లిమిట్ ఏమి లేదు మీ ఇష్టం. జంతికలు, చెక్కలు, చిప్స్, పల్లీ లడ్డు, సకినాలు, సర్వపిండి, బూందీ మిక్చర్ ఇలా మీకు తెలిసిన ప్రతి ఐటెం అమ్మొచ్చు. లాభాలు సంపాదించొచ్చు. నిజానికి ఈ రోజుల్లో పెద్దవాళ్ళు కూడా పిజ్జాలు, బర్గర్ లు మానేసి చిరుతిండ్లుగా ఇవే ఎక్కువగా తీసుకుంటున్నారు. సో బిజినెస్ కి ఢోకాలేదు. పెరిగేది తప్ప తరిగేది కాదు ఈ వ్యాపారం.

పెట్టుబడి, కావలిసిన ఎక్విప్మెంట్:
దీనికి కావలిసి పెట్టుబడి అంటూ ఏమి పెద్దగా ఉండదు, మీ కిచెన్ పెద్దగా ఉంటే ఇంటి నుండి కూడా చెయ్యొచ్చు (ఆన్లైన్ లో అమ్మాలంటే నిబంధనలు మారుతాయి)

కావలిసిన వస్తువులు క్వాంటిటీ ధర (₹) ఇతర వివరాలు
డీప్ ఫ్రయర్/గ్యాస్ స్టవ్ + సిలిండర్ 1 4,000 – 5000 డబుల్ బర్నర్ బెటర్
ఐరన్ కడాయి (10-12 లీటర్) 1 1,200 నుండి ప్రారంభం కాస్ట్ ఐరన్ ది అయితే ఫ్రైలకు బాగుంటుంది
మురుకుల ప్రెస్ (స్టెయిన్‌లెస్ స్టీల్) 1 700 వివిధ రకాల ప్లేట్లు ఉన్నవి
డిజిటల్ వేయింగ్ మెషిన్ 1 1,000 కరెక్ట్ వెయిట్ కోసం
స్టెయిన్‌లెస్ టేబుల్ / పెద్ద ట్రేలు 2 2,000 చల్లబరచడానికి, ప్యాకింగ్ కోసం
సీలర్ మెషిన్ 1 1,500 ఐటమ్స్ ప్యాకింగ్ కోసం
ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కవర్లు 1,000 pcs 1,200 200 గంటల నుండి కిలో వరకు వివిధ సైజులు
స్టోరేజ్ డబ్బాలు 8 1,500 ఎయిర్‌టైట్ కంటైనర్లు
గ్లోవ్స్, ఏప్రాన్ సెట్ 300 శుభ్రత కోసం
లైసెన్స్ ఫీజులు (FSSAI, Shops) 500-1,000 బేసిక్ రిజిస్ట్రేషన్
రా మెటీరియల్ 5,000 సెనగ పిండి, పల్లీలు, శనగలు, నువ్వులు, ఆయిల్, ఇతర పదార్థాలు
బ్రాండ్ స్టిక్కర్లు 500 బ్రాండింగ్ కోసం

మార్కెటింగ్ ఎలా:
సింపుల్ మీ ఇంటిదగ్గర ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, స్వీట్ షాప్ లు టార్గెట్ చెయ్యండి. ఇప్పుడు స్కూల్లో స్నాక్స్ టైం లో ఫుడ్ అమ్మటానికి కౌంటర్ లు కూడా పెడుతున్నారు. వాటిని కాంటాక్ట్ చేసి ఆర్డర్ లు తీసుకోగలిగితే మీకు అమ్మకాలకు భరోసా ఉంటుంది. వీటితో పాటు మరీ ముఖ్యమైనది సోషల్ మీడియా పబ్లిసిటీ. మీరు మీ కిచెన్ ఫుడ్ ఫోటోలు, ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్ గా అప్లోడ్ చెయ్యండి, చిన్న చిన్న instagram వీడియోలు చేసి పెట్టండి. ఆన్లైన్ లో ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీలు కూడా సొంతగా చెయ్యండి. సంక్రాంతి వంటి పండుగలకు స్పెషల్ ఆర్డర్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీ లొకాలిటీ లో ఒక 10 కిలోమీటర్ల వరకు టార్గెట్ చెయ్యగలిగితే చాలు. మీరు ఒక 10 మందికి ఉపాధి కలిగించొచ్చు. ముందు మెల్లగా స్టార్ట్ చేసిఅమ్మకాలు పెరుగుతుంటే చిన్న కిచెన్ పెట్టుకోవడానికి ప్లేస్ తీసుకోండి. మరీ కమర్షియల్ స్పేస్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ రోడ్ కు దగ్గర ఉంటే చాలు. స్టార్టింగ్ లో వర్కర్లు అవసరం పెద్దగా ఉండదు. మీ కుటుంబ సభ్యులను భాగం చేసుకోండి. బిజినెస్ పెరిగిన తరువాత మీరు వర్కర్స్ ను, ఎక్విప్మెంట్ పెంచుకోవచ్చు.

ఆన్లైన్ అమ్మకాల కోసం

ఒక వేళ మీరు ఆన్లైన్ లో అమ్మాలనుకుంటే స్విగ్గీ, జొమాటో వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి. అప్పుడు బేసిక్ లైసెన్స్ సరిపోదు, స్టేట్ లైసెన్స్ నీడ్ ఉంటుంది. దానికి కొంచెం ఖర్చు అదనం ( 2 వేల నుండి పెద్ద స్థాయి అయితే 5 వేలవరకు ఉంటుంది) దీంతో పాటు GST రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇవి నిలువ స్నాక్స్ కాబట్టి క్లౌడ్ కిచెన్ కింద రిజిస్టర్ అవి అమ్మటం వీలుకాదు అందుకే డైరెక్ట్ సెల్లర్ గా రెజిస్టరై అమ్మకాలు చేసుకోవచ్చు. మీరు స్విగ్గీ, జొమాటో, ఇతర ఆన్లైన్ సంస్థలను సంప్రదిస్తే పూర్తి వివరాలు లభిస్తాయి.

Disclaimer : ఇది పెట్టుబడి సలహా, బిజినెస్ సలహా కాదు అని గుర్తుపెట్టుకోండి. వాస్తవం లో మేము ఇచ్చిన ప్లాన్ కేవలం అవగాహన కోసమే. ఐటమ్స్ కోసం మేము ఇచ్చిన ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఈ వ్యాపారం వల్ల ఇంత లాభం రావొచ్చు అనేది ఒక అంచనా మాత్రమే. మీ ప్రోడక్ట్ క్వాలిటీ, మార్కెటింగ్, ధర మీ లాభాలను నిర్ణయిస్తాయి. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.