ఏఐతో భయపడుతున్న ఉద్యోగుల్లో మనమే ఫస్ట్-తాజా సర్వేలో షాకింగ్

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ అన్ని రంగాల్లో దూసుకొస్తోంది. ఏఐ రాకతో ఉద్యోగాలు చాలా వేగంగా ఆవిరైపోతున్నాయి. ఇప్పటికే ఐటీ సంస్దలన్నీ కింది స్దాయి ఉద్యోగులతో పాటు ఉన్నత స్ధానాల్లో ఉన్న ఉద్యోగుల్ని సైతం ఏఐతో భర్తీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.


దీంతో ప్రతీ దేశంలోనూ ఇప్పుడు ఏఐ ఉద్యోగుల్ని భయపెడుతోంది. అయితే ఇలా ఏఐ తమ ఉద్యోగాలు లాగేసుకుంటుందని ఉద్యోగులు భయపడుతున్న దేశాల్లో భారత్ ఆగ్రస్ధానంలో ఉందని తాజా సర్వేలో తేలింది.

గ్లోబల్ పబ్లిక్ ఒపీనియన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ వివిధ దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో భారత్ తో పాటు పాకిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఉద్యోగులు ఏఐ రాకపై ఎక్కువగా భయపడుతున్నట్లు తేలిందట. వచ్చే దశాబ్ద కాలంలో ఏఐ కారణంగా తమ ఉద్యోగాలు పోవడం ఖాయమని ఈ దేశాల్లో ఉద్యోగులు ఎక్కువగా భయపడుతున్నారట. 21 దేశాల్లో కనీసం వెయ్యి మంది చొప్పున ఉద్యోగుల్ని ఎంచుకుని నిర్వహించిన ఈ సర్వేలో పలు షాకింగ్ ఫలితాలు వచ్చాయి.

అయితే అభివృద్ధి చెందిన దేశాలకూ, అభివృద్ధి చెందుతున్న దేశాలకూ మధ్య ఉద్యోగుల అభిప్రాయాల్లో ఈ అంశంపై వ్యత్యాసాలు ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలను వెల్లడించిన విజువల్ క్యాపిటలిస్ట్ అనే సంస్థ పేర్కొంది. భారత్ లో అయితే ప్రతీ నలుగురిలో ముగ్గురు ఏఐ కారణంగా వచ్చే దశాబ్దంలో తమ ఉద్యోగాలు పోవడం ఖాయమని చెప్పారు. ఇందులో 36 శాతం మంది అయితే కచ్చితంగా ఉద్యోగాలు పోతాయని చెప్పారు. మరో 39 శాతం మంది పోవచ్చని చెప్పారు. ఇంకో 17 శాతంమంది మాత్రం పోకవచ్చని అన్నారు. 8 శాతం మంది మాత్రం కచ్చితంగా తమ ఉద్యోగాలు పోవని చెప్పేశారట.

పాకిస్తాన్ లో అయితే 72 శాతం మంది ఏఐ కారణంగా వచ్చే పదేళ్లలో తమ ఉద్యోగాలు కచ్చితంగా పోతాయని ఈ సర్వేలో చెప్పారు. ఇండోనేషియాలో అయితే 76 శాతం మంది ఇలా తమ ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేసేస్తుందని చెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగులు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఏఐ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.