సెలబ్రిటీలు తమతమ రంగాల్లో రాణించడంతోపాటు వ్యాపారాల్లోనూ సత్తా చాటుతుంటారు. అలా టాలీవుడ్లో అనేక మంది స్టార్ హీరోలు ఇటు సినిమాల్లో మంచి విజయాలు అందుకుంటూనే బిజినెస్‌లోనూ తమదైన మార్క్ చూపిస్తున్నారు. ఇందులో ముఖ్యమైనంది ఫుడ్ బిజినెస్. తెలుగు హీరోలు చాలా మంది ఫుడ్ వ్యాపారాల్లో దిగారు. అంతేకాదు తమ వ్యాపారాలను తామే ప్రమోట్ చేసుకుంటూ ప్రేక్షకులకు వాళ్ల బ్రాండ్ పరిచయం చేస్తున్నారు.
వెండితెరపై అలరిస్తూనే, బయట తమ క్రేజ్‌ని ఫుడ్ అండ్ లైఫ్‌స్టైల్ రంగంలోకి తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్, హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు ఎక్కడ చూసినా స్టార్ హీరోల రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫుడ్ లవర్స్‌కు హాట్ ఫేవరెట్‌గానూ మారాయి. ఇక సినిమా స్టార్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో రెస్టారెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఎవరెవరివి ఉన్నాయో మీకు తెలుసా?
రానా దగ్గుబాటి – బ్రాడ్వే (2024-25)
బంజారాహిల్స్‌లో 25,000 స్క్వేర్‌ఫీట్‌లో ఏర్పాటు చేసిన ఈ లైఫ్‌స్టైల్ హబ్‌లో ఫుడ్, ఫ్యాషన్, వెల్నెస్ అన్నీ ఉంటాయి. ఇందులోని ఫుడ్ స్టోరీస్ క్యాఫే 2025లో ఓపెన్ అయింది. ఇక్కడ గోర్మెట్ ఫుడ్, ఆర్టిసన్ కాఫీ, ఇంటరెస్టింగ్ డిజర్ట్స్ అందుబాటులో ఉంటాయి.
అల్లు అర్జున్ – బఫలో వైల్డ్ వింగ్స్
జూబ్లీహిల్స్‌లోని ఈ స్పోర్ట్స్ బార్ మ్యాచ్ స్క్రీనింగ్స్, వింగ్స్ విషయంలో ఫేమస్. క్రికెట్ సీజన్లో ఇక్కడ వాతావరణం స్టేడియం తరహాలో ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా సూపర్బ్ అనే కామెంట్స్ వస్తుంటాయి.
నాగ చైతన్య – షోయు అండ్ స్కుజి
షోయు పాన్- ఏషియన్ డిషెస్ క్లౌడ్ కిచెన్‌గా హైలెట్ అయ్యింది. స్కుజిలో యూరోపియన్ స్టైల్ ఫుడ్ స్పెషలిటీ. నాగచైతన్య దీన్ని ఎంతో స్పెషల్‌గా డిజైన్ చేసుకున్నాడు. తరచుగా ప్రమోట్ కూడా చేస్తుంటారు.
మహేష్ బాబు – ఏఎన్ రెస్టారెంట్స్
బంజారాహిల్స్‌లో అందమైన వాతావరణంలో ఇండియన్, ఏషియన్ ఫుడ్ మిక్స్‌గా అందించే ఈ ప్లేస్ హై ప్రొఫైల్ గెస్ట్‌లకు ఫేవరెట్.
నాగార్జున – ఎన్ గ్రిల్, ఎన్ ఏషియన్
కాంటినెంటల్, ఏషియన్ ఫుడ్ అందించే ఈ రెండు స్పాట్స్ చాలా ఏళ్లుగా స్టార్ల్యాండ్మార్క్స్. నాగ్ రుచి, స్టైల్ హైలైట్ అయ్యేలా ఉంటాయి.
రానా దగ్గుబాటి – సాంక్చువరీ
ఫిల్మ్‌నగర్‌లో తన పాత ఇంటిని సాంక్చువరీగా మార్చి గ్లోబల్ స్మాల్ ప్లేట్స్ అందిస్తున్నారు. ఇక్కడ హోం స్టైల్ కంఫర్ట్ ఫుడ్ కూడా దొరుకుతుంది.
ఆనంద్ దేవరకొండ – గుడ్ వైబ్స్ ఓన్లీ క్యాఫే
ఖజాగుడాలోని ఈ క్యాఫేలో బర్గర్స్, పాస్తా, టర్కిష్ ఎగ్స్ ఉంటాయి. సస్టైనబుల్ కాన్సెప్ట్‌తో కూడా ఫేమస్.
శర్వానంద్ – బీన్జ్ అండ్ శశాంక్ – మాయాబజార్
బీన్జ్లో తెలుగు స్నాక్స్, మాయాబజార్లో ముగలాయి వంటకాలు అందిస్తారు. సినిమా థీమ్‌తో ఉండే మాయాబజార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
సందీప్ కిషన్ – వివాహ భోజనంబు
సికింద్రాబాద్‌లోని ఈ స్పాట్ అసలైన తెలుగు మీల్స్‌కి ప్రసిద్ధి చెందింది. సంప్రదాయ వంటకాలు ఇక్కడ సూపర్ హిట్.































