విశాల్ ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా.. ?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా మాస్ యాక్షన్ చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. కానీ మూవీస్ కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంటారు. త్వరలోనే ఈ హీరో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ సాయి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నారు.

తమిళ చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోలలో విశాల్ ఒకరు. ఎక్కువగా యాక్షన్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నారు. దాదాపు 24 ఏళ్లుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న విశాల్.. కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నటి సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరి వివాహం ఈ ఏడాది చివర్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగస్ట్ 29న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో విశాల్ షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి. దీంతో ఇప్పుడు విశాల్ పెళ్లి తేదీ, అతడి పర్సనల్ లైఫ్, ఆస్తుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.


విశాల్ వయసు 47 సంవత్సరాలు. గ్రానైట్ వ్యాపారవేత్త జీకే రెడ్డి, జానకీ దేవి దంపతులకు జన్మించారు. ఆయన సోదరుడు విక్రమ్ కృష్ణ సైతం నటుడు, నిర్మాతగా కొనసాగుతున్నారు. దాదాపు 24 ఏళ్లు సినిమా ప్రపంచంలో ఉన్నారు విశాల్. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అలాగే 2013లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. నివేదికల ప్రకారం విశాల్ ఆస్తులు రూ.25 కోట్లు. చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పొందారు. సినిమాల్లోకి రాకముందు కూతు పి పట్టరై అనే నాటక బృందంలో చేరారు.

ఇక విశాల్ కార్ కలెక్షన్ విషయానికి వస్తే.. అతడి దగ్గర జాగ్వార్ XF, ఆడి Q7, BMW X6, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. విశాల్ కు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇక విశాల్ పెళ్లి చేసుకోబోయే సాయి ధన్సిక వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. ఇప్పటికే తమిళం, తెలుగులో పలు సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రంతో ఫేమస్ అయ్యింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.