అమెరికా టూరిజం పరిశ్రమ అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి పడిపోయింది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆకర్షణీయమైన టూరిజం స్పాట్లలో ఒకటి అమెరికా.ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద పాలసీల కారణంగా పతనానికి గురవుతోంది.
2025 సంవత్సరంలో అమెరికాకు వచ్చే విదేశీ సందర్శకుల సంఖ్య భారీగా తగ్గింది. టూరిజం రెవెన్యూ $12.5 బిలియన్లు తగ్గిపోయింది. ఈ పతనానికి ప్రధాన కారణాలుగా ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా ప్రక్రియలో ఆలస్యాలు , అంతర్జాతీయ సంబంధాల్లో ఉద్రిక్తతలు గుర్తించారు. ఇవన్నీ ట్రంప్ చేసిన పాపాలే.
భారీగా తగ్గిన టూరిస్టులు – అమెరికా టూరిజంలో సంక్షోభం
అమెరికా టూరిజం పరిశ్రమ, దేశ ఆర్థిక వ్యవస్థలో 2.9 ట్రిలియన్ డాలర్ల గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GDP)కు దోహదపడుతోంది.15 మిలియన్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు టూరిస్టులు తగ్గిపోవడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెన్సీలు ,లోకల్ ఎకనామీలపై భారీ ప్రభావం చూపింది.ఈ సమస్యలు దీర్ఘకాలిక ప్రభావాలకు కారణం అవుతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చైనా, యూరప్, భారత్ వంటి ప్రధాన మార్కెట్ల నుంచి సందర్శకులు 15-25% తగ్గారు. ట్రంప్ “అమెరికా ఫస్ట్” విధానం, ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు, వీసా అప్లికేషన్లలో 40 శాతానికిపైగా పైగా ఆలస్యాలు, సందర్శకులను దూరం చేస్తున్నాయి.
ఇతర దేశాలకు భారీగా పర్యాటకులు
యూనైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా టూరిజం 5 శాతం పెరిగినప్పటికీ, అమెరికా మాత్రమే నెగటివ్ గ్రోత్ చూపుతోంది. ఈ ట్రెండ్ కొనసాగితే, 2026 నాటికి అమెరికాకు 50 బిలియన్ డాలర్లకుపైగా పైగా నష్టం జరగవచ్చని నిపుణులు అంచనా. పర్యాటకలకు ఇచ్చే B1/B2 వీసాల ప్రక్రియలు గంటల నుంచి వారాలకు మారాయి, విదేశీయులపై ట్రంప్ చేస్తున్న విద్వేష వ్యాఖ్యల కారణంగా వారు అమెరికాను “అన్‌సేఫ్”గా భావిస్తున్నారు.
దీర్ఘ కాలంలో భారీగా నష్టపోనున్న అమెరికా
అమెరికాకు నష్టం జరిగితే ఆస్టలియా, కెనడా, మెక్సికో వంటి పొరుగు దేశాల టూరిజంకు మేలు కలుగుతోంది. కెనడా టూరిజం రెవెన్యూ 12% పెరిగింది. అమెరికా వీసా సమస్యల వల్ల సందర్శకులు అక్కడకు మళ్లారు. టూరిజం పతనం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తీస్తోంది. ఆ 2025లో 200,000కు పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా హోస్పిటాలిటీ సెక్టర్లో. న్యూయార్క్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు $5 బిలియన్ల నష్టానికి గురయ్యాయి. ట్యాక్స్ రెవెన్యూ 10% తగ్గడంతో, స్థానిక ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై ఆధారపడుతున్నాయి. ఈ పతనం కేవలం టూరిజంకు మాత్రమే కాకుండా, సంబంధిత రంగాలైన రిటైల్, ఎంటర్టైన్మెంట్, ట్రాన్స్‌పోర్టేషన్‌ను కూడా ప్రభావితం చేస్తోంది. డిస్నీలాంటి, గ్రాండ్ కాన్యాన్ వంటి ఆకర్షణలు 15% తగ్గిన బుకింగ్‌లు చూస్తున్నాయి. లాంగ్-టర్మ్‌గా, ఇది అమెరికా గ్లోబల్ ఇమేజ్ను దెబ్బతీస్తుంది
































