ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఎమోషన్. సొంత ఇంట్లో జీవించాలని చాలామంది కోరుతూ ఉంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు.
అయితే ఇల్లు నిర్మించడం అంటే ఆషామాషీ కాదు. అలాగే ఇల్లు కొనుగోలు చేయాలన్నా.. అన్ని రకాలుగా పరిశీలించాలి. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వాస్తు అనుకూలంగా ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి వీధి పోటు ఉంటే నష్టమే అని కొందరు పండితులు చెబుతారు. ఇంటికి వీధి పోటు ఉండటం వల్ల ఆ ఇంటికి ఎప్పటికీ దోషం తగులుతుందని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల వీధిపోట్లు ఇంటికి మేలు చేస్తాయి. మరికొన్ని కీడు చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఒక ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా రోడ్డు ఉంటే దానిని వీధి పోటు అంటారు. మీది పోటు అంటే ఆ రోడ్డు నుంచి వచ్చే వారి దృష్టి ఎక్కువగా ఆ ఇంటి పైనే పడుతుంది. ఇలా నేరుగా ఇంటిపై పడడం వల్ల దోషం ఉంటుందని కొందరు చెబుతారు. అయితే ఒక ఇంటికి ఎదురుగా రోడ్డు ఉండి అది కొంత దూరం వెళ్లి ఎండ్ అయితే దానిని వీధి పోటు అంటారు. అలా కాకుండా ఆ రోడ్డు అలాగే ముందుకు వెళితే. దానిని వీధి శూల అంటారు. వీధి పోటు కంటే వీధి శూల చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే వీధి పోర్టులో కొంతమంది మాత్రమే వస్తుంటారు ..వెళుతుంటారు.. వీధి శూల లో అనేకమంది వస్తుంటారు.. వెళ్తుంటారు.. అందుకే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాస్తు పండితులు తెలుపుతున్నారు. అయితే కొన్ని రకాల వీధి పోట్లు ఇంటికి మేలు చేస్తాయని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటికి తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యంలో వీధి పోటు లేదా వీధి శూల ఉంటే అవి ఆ ఇంటికి మేలే చేస్తాయి. ఇలా ఉన్న ఇంటిని నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. అయితే వారి జాతకరీత్యా ఎలా ఉంటుందో చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాలి. అలాగే దక్షిణ నైరుతి, పడమర నైరుతి వీధి పోటు ఉంటే ఇవి చాలా కీడు చేస్తాయి. వీటివల్ల ఆ ఇంట్లో ఎప్పటికీ నష్టాలే జరుగుతాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు నిర్మించుకోవాల్సి రావడం లేదా ఆ ఇంటిని కొనుగోలు చేయడం చేస్తే.. పరిహారం చేసుకోవచ్చు. ఇలాంటి వీధి పోటు ఉన్న ఇంటికి బలమైన గోడను నిర్మించుకోవాలి. ఈ గోడ పై రాక్షసుడి బొమ్మ లేదా వినాయకుడి ప్రతిమను పెట్టుకోవచ్చు. అలాగే ఎవరి పేరు మీదనైతే ఇల్లు కొనుగోలు చేస్తున్నారు వారికి అనుకూలంగా ఉంటుందా? లేదా అనేది తెలుసుకోవాలి. కొందరి జాతక రీత్యా వీధి పోట్లు, వీధి శూలాల ఇండ్లు కలిసి వస్తాయి.
































