కాలుష్యం, కల్తీ ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా ఈ మధ్య సంతానం కలిగే అవకాశం దాదాపు 50శాతం తగ్గిపోయింది. కానీ ఈ తల్లి మాత్రం ఒకేసారి నలుగురు పిల్లలను కనేసింది.
అవును.. మహారాష్ట్ర సతారాలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది మహిళ. తల్లి, పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండగా.. తక్కువ బరువుతో పుట్టడంతో నవజాత శిశువులను స్పెషల్ కేర్ కోసం ఐసీయూలో పెట్టారు. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు కావడంతో కుటుంబం మొత్తం సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. కాగా కాజల్‌కు ముందు ట్విన్స్ పుట్టగా.. ఆ తర్వాత కాన్పులో ఒక అబ్బాయి జన్మించాడు. ఇప్పుడు నలుగురు పిల్లలు పుట్టారు. దీంతో మొత్తం ఏడుగురు చిన్నారులను కలిగిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక నలుగురు పిల్లలకు సేఫ్‌గా డెలివరీ చేసిన డాక్టర్ దేశాయ్, డాక్టర్ సాల్మా, డాక్టర్ ఖడ్తారే, డాక్టర్ ఝెండే, డాక్టర్ దీపాలీ రాథోడ్ వైద్య బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి కేసులు చాలా రేర్ అని.. సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ అయినందుకు సంతోషంగా ఉందన్నారు.
































