కేవలం రూ.10.50 లక్షలకే 29 కి.మీల మైలేజ్ కారు..

మారుతి సుజుకి ఎప్పుడూ భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తన కొత్త మోడళ్లను రూపొందిస్తూ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అందులో భాగంగా ఇటీవల కంపెనీ విక్టోరిస్ అనే అత్యాధునిక SUVను ఆవిష్కరించింది.


ఈ కారు కేవలం డిజైన్ పరంగానే కాకుండా, భద్రతా ప్రమాణాల్లోనూ ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. తాజాగా విక్టోరిస్ SUV ప్రారంభ ధరను కంపెనీ ఎక్స్ షోరూమ్ రూ.10.50 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరతో ఇది తన సెగ్మెంట్‌లో వినియోగదారులకు పోటీగా, విలువైన ఆప్షన్‌గా నిలవనుంది. అధికారికంగా విక్రయాలు సెప్టెంబర్ 22, 2025 నుండి మొదలుకానున్నప్పటికీ, ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించడంతో ఈ కొత్త SUVపై ఆటోమొబైల్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

దీని వేరియంట్ల వారీగా ధరలు చూసినట్లయితే, మారుతి సుజుకి తాజాగా ఆవిష్కరించిన విక్టోరిస్ SUV ధరలు వేరియంట్ల వారీగా చూస్తే, వినియోగదారులకు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్లపై దృష్టి సారిస్తే, ఎంట్రీ లెవెల్‌గా 1.5 MT LXi వేరియంట్‌ను కంపెనీ రూ.10.50 లక్షల ప్రారంభధరతో అందిస్తోంది. అదే సమయంలో, కాస్త మెరుగైన ఫీచర్లు కావాలనుకునేవారికి 1.5 MT VXi రూ.11.80 లక్షలకు లభిస్తుంది.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌తో వచ్చే 1.5 AT VXi రూ.13.36 లక్షలకు లభిస్తుంది. ఇంకా ప్రీమియం టచ్ కోరుకునేవారికి 1.5 MT ZXi రూ.13.57 లక్షలకు, 1.5 AT ZXi రూ.15.13 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. మరింత హైఎండ్ వేరియంట్‌లలో 1.5 MT ZXi (O) రూ.14.80 లక్షలకు, ఆటోమేటిక్ వేరియంట్ రూ.15.64 లక్షలకు వస్తుంది. అత్యాధునిక ఫీచర్లు కలిగిన ZXi+ వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ.15.24 లక్షలకు లభిస్తుంది.

ఆటోమేటిక్ ఆప్షన్‌తో రూ.17.19 లక్షలకు దొరుకుతుంది. అలాగే ZXi+(O) వేరియంట్లు మాన్యువల్‌లో రూ.15.82 లక్షలు, ఆటోమేటిక్‌లో రూ.17.77 లక్షల ధరకు లభిస్తున్నాయి. అదేవిధంగా AllGrip ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కోరుకునేవారికి కూడా ప్రత్యేక వేరియంట్లు సిద్ధం చేశాయి. వీటిలో 1.5 AT ZXi+ AllGrip రూ.18.64 లక్షలకు, 1.5 AT ZXi+(O) AllGrip రూ.19.22 లక్షలకు లభిస్తున్నాయి.

ఇక CNG ఆప్షన్ కోరుకునే వినియోగదారుల కోసం కూడా విక్టోరిస్‌లో ప్రత్యేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 1.5 MT LXi CNG రూ.11.50 లక్షలకు, 1.5 MT VXi CNG రూ.12.80 లక్షలకు, 1.5 MT ZXi CNG రూ.14.57 లక్షలకు లభిస్తున్నాయి. ఇక బలమైన-హైబ్రిడ్ వేరియంట్ల విషయానికి వస్తే, ఇవి మరింత సాంకేతికతతో కూడిన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయి. 1.5 e-CVT VXi రూ.16.38 లక్షలకు అందుబాటులో ఉంటుంది.

అదే విధంగా 1.5 e-CVT ZXi రూ.17.80 లక్షలకు, ZXi (O) రూ.18.39 లక్షలకు లభిస్తున్నాయి. టాప్-ఎండ్ మోడళ్లలో 1.5 e-CVT ZXi+ రూ.19.47 లక్షలకు, ZXi+(O) వేరియంట్ రూ.19.99 లక్షలకు అందుబాటులో ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. మొత్తం మీద, మారుతి విక్టోరిస్ SUV ధరల జాబితా చూస్తే, ప్రతి వినియోగదారుడికి అనుగుణంగా, మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, సిఎన్‌జి లేదా ఆల్‌గ్రిప్ డ్రైవ్ ఆప్షన్లను అందిస్తోంది.

భద్రత విషయానికి వస్తే, విక్టోరిస్ SUV మారుతి సుజుకి చరిత్రలోనే అత్యంత సురక్షితమైన మోడల్‌గా గుర్తింపు పొందింది. గ్లోబల్ NCAP, భారత్ NCAP పరీక్షల్లో ఇది పూర్తి 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఇప్పటి వరకు మారుతి మోడళ్లపై ఉండే సేఫ్టీ అంశంపై విమర్శలను ఇది సమాధానం చెప్పినట్టే. ఈ SUV రహదారిపై ప్రయాణించే ప్రతి కుటుంబానికి, డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మరింత నమ్మకాన్ని కలిగించే రీతిలో తయారు చేయబడింది.

డిజైన్ పరంగా ఆకర్షణీయమైన శైలితో, టెక్నాలజీ పరంగా ఆధునిక ఫీచర్లతో, అలాగే భద్రతలో అత్యుత్తమ రేటింగ్‌తో విక్టోరిస్ SUV మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కారును చూస్తే, మారుతి కేవలం సరసమైన ధరలో వాహనాలను అందించే బ్రాండ్ మాత్రమే కాకుండా, భద్రత, ప్రీమియమ్ అనుభవం, ఆధునిక ఇంజనీరింగ్‌లోనూ కొత్త దిశగా అడుగులు వేస్తోందని చెప్పాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.