దసరా సెలవుల్లో బిగ్ ట్విస్ట్! భారీ బాంబు పేల్చిన ఏపీ ప్రభుత్వం

తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా దసరా పండుగను అత్యంత వైభవంగా హిందూ ప్రజలు చేసుకుంటారు. ఏపీతోపాటు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.


ఈ ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దాదాపుగా పది నుంచి పదిహేను రోజుల సెలవులు వస్తున్నాయి.ఇప్పటివరకైతే తెలంగాణ దసరా సెలవులపై నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీలో మాత్రం దసరా సెలవులపై గందరగోళం నెలకొంది. ఈనెల 22వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించారని వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు పండుగ చేసుకునేందుకు సిద్ధమవగా.. ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. సెలవులపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం గమనార్హం.

దసరా సెలవులు 22 నుంచి మొదలవుతాయని జరుగుతున్న ప్రచారాన్ని విద్యాశాఖ కొట్టి వేసింది. విద్యా శాఖ మంత్రి ఓఎస్డీ తెలియజేసినట్లు వస్తున్న సందేశాలు అవాస్తవమని ప్రకటించింది. విద్యా శాఖ దసరా సెలవులపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయమై విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ ఆకుల వెంకటరమణ అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ శాఖ ప్రకటించింది . ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. ప్రస్తుతానికి దసరా సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చింది.

గందరగోళం
దసరా సెలవులపై తాజా ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ లో గందరగోళం ఏర్పడింది. దసరా సెలవులు ఎప్పుడూ అనేది స్పష్టత రాలేదు. తాజాగా విద్యా శాఖ ఇచ్చిన ప్రకటనతో ఆ గందరగోళం మరింత పెరిగింది. ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం వరకు చూస్తే దసరా సెలవులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉండవచ్చు. 3వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు పునఃప్రారంభమవుతాయని అంతటా చర్చ జరుగుతోంది. మరి విద్యా శాఖ ఇచ్చిన ప్రకటనతో దసరా సెలవులపై ఏపీలో జరుగుతున్నదంతా ఉత్తి ప్రచారమేనని అర్థమవుతోంది.

తెలంగాణలో అయితే ఇప్పటికే దసరా సెలవులపై స్పష్టమైన ప్రకటన ఉంది. బతుకమ్మ ఉత్సవాలు, దేవీ శరన్నవరాత్రి వేడుకలతో కలిపి ప్రభుత్వం అక్టోబర్ 6వ తేదీ వరకు దాదాపు 15 రోజులు సెలవులు ఇచ్చింది. కర్ణాటకలో అయితే 16 రోజులు ఇచ్చారు. మరి ఏపీలో మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దసరా సెలవులు ఎప్పుడా? అని విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నాయి. సెలవులు తగ్గుతాయా? పెరుగుతాయా? అనేది చర్చ జరుగుతోంది. మరి సెలవులపై విద్యా శాఖ స్పష్టమైన ప్రకటన చేస్తే విద్యార్థులు పండుగ చేసుకునేందుకు సిద్ధమవుతారు. వారి కుటుంబం కూడా ఒక ప్రణాళిక వేసుకుని ఉంటారు. వెంటనే ఏపీ విద్యా శాఖ దసరా సెలవులపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.