నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆహారంలో తీసుకోవల్సిన ముఖ్యమైన పదార్ధాల్లో కూడా నిమ్మ ఒకటి. చాలా మందికి నిమ్మకాయ లేకుండా భోజనం అసంపూర్ణంగా అనిపిస్తుంది.
నిమ్మరసం వేడి వేడి ఆహారంలో అలా చిలికించి తింటే ఆ రుచే వేరు. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, నిర్విషీకరణ లక్షణాలు ఉంటాయి.
నిమ్మ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మ రంగు కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా, బరువు తగ్గడానికి నిమ్మకాయ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
నిమ్మ ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.. దీన్ని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే విషపూరితం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇది అలెర్జీలు, గ్యాస్, చర్మ సమస్యలను కలిగిస్తుంది.
నిమ్మకాయను పాలు, పాల ఉత్పత్తులతో కలిపి మర్చిపోయి కూడా తినకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. పాలు, నిమ్మకాయను కలిపి తినడం వల్ల కూడా గ్యాస్ సమస్యలు వస్తాయి.
గుడ్లు ప్రోటీన్ కు మంచి మూలం. అయితే గుడ్లు, నిమ్మకాయను ఎప్పుడూ కలిపి తినకూడదు. ఇది అనేక తీవ్రమైన కడుపు సమస్యలను కలిగిస్తుంది.
































