దసరా ఆఫర్.. రూ.15వేల లోపే వచ్చే 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే

పండుగలు వచ్చాయంటే చాలు ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ అమ్మకాలపై భారీ డిస్కౌంట్స్ ఉంటాయి. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఆన్ లైన్ పోర్టల్స్ లో గతంలో కంటే తక్కువ ధరకే వస్తాయి.


అక్టోబర్ 2న దసరా పండుగ ఉండటంతో కొన్ని స్మార్ట్ ఫోన్స్ సేల్‌లో తక్కువ ధరకే రాబోతున్నాయి. అవి ఏవో చూద్దాం..

VIVO T4x: ఈ ఫోన్ ధర అమెజాన్ ఫ్లిప్ కార్ట్‌లలో రూ.13,999గా ఉంది. పండుగ సమయానికి ఆఫర్స్‌తో దీని ధర మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఫోన్ అనే చెప్పాలి. Funtouch OS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో దీనిని తీసుకువచ్చారు. ఇందులో 8 GB RAM తో పాటు 256 GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది. 6.77 ఇంచుల డిస్ ప్లేతో ఈ మోడల్ ఆకట్టుకుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇక 5700 mAh పవర్ ఫుల్ బ్యాటరీ దీని ప్రత్యేకత.

Samsung Galaxy M35: బెస్ట్ కెమెరా ఫోన్ కొనాలనుకునేవాళ్లకు Samsung Galaxy M35 మంచి ఆప్షన్. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.16,990 ఉండగా ఆఫర్ లో రూ.15వేలు అంతకంటే తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమోరీ ఉన్నాయి. 6.6 ఇంచుల డిస్ప్లే అందుబాటులో ఉంది. అంతే కాకుండా 50 మెగాపిక్సల్ కెమెరాతో సామ్ సంగ్ దీనిని తీసుకువచ్చింది. సామ్ సాంగ్ కెమెరా క్లారిటీకి మంచి పేరు ఉండటంతో దీనికి మార్కెట్ లో డిమాండ్ ఉంది. ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

POCO X7 5G: 15వేల ధరలో ఫోన్ తీసుకోవాలని అనుకునేవారికి పోకో ఎక్స్ సెవెన్ 5జీ కూడా మంచి ఆప్షన్. ఇది వరకు దీని ధర రూ.20వేలు ఉండగా ప్రస్తుతం రూ.16,999లకే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దసరాకి దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రూ.15వేలకి వస్తే దీనిని సైతం తీసుకోవచ్చు. ఈ ఫోన్ లో 8 GB RAM తో పాటు 128 GB ఇంటర్నల్ మెమోరీ ఉన్నాయి. 6.67 ఇంచుల డిస్ ప్లే ఉంది. అంతే కాకుండా 50MP + 8MP + 2MP రేర్ ట్రిపుల్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5500 mAh Battery బ్యాటరీ ఉంది. అంతే కాకుండా Dimensity 7300 Ultra Processorతో తీసుకువచ్చారు.

Nothing Phone 2 Pro: ప్రస్తుతం దీని ధర రూ.16,999 ఉండగా ఆఫర్‌లో రూ.15వేలకే వచ్చే అవకాశం ఉంది. పర్ఫామెన్స్ పరంగా బెస్ట్ ఇస్తుంది కాబట్టి దీనిని కూడా తీసుకోవచ్చు. ఈ ఫోన్‌ లో 8 GB RAMతో పాటు 128 GB ఇంటర్నల్ మెమోరీ ఉంది. 6.77 ఇంచుల డిస్ ప్లేతో స్టైలిష్ లుక్ లో ఉంది. 50MP + 50MP + 8MP రేర్ కెమెరా, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Dimensity 7300 Pro 5G ప్రాసెసర్‌తో దీన్ని తీసుకువచ్చారు.

realme ప్రొ౩: ప్రస్తుతం దీని ధర కూడా రూ.15,999 ఉండగా పండగ ఆఫర్ లో రూ.15వేలకే వచ్చే అవకాశం ఉంది. ఇందులో 6 GB RAM మరియు 128 ఇంటర్నల్ మెమోరీ ఉన్నాయి. 6.67 ఫుల్ హెచ్ డిస్ ప్లేతో ఉంది.ఈ ఫోన్ లో 50MP రేర్ కెమెరా మరియు 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh ఉండగా 6 Gen 4 Processorతో తీసుకువచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.