పని గంటల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రస్తుతం ఉన్న ఎనిమిది గంటల సమయాన్ని 10 గంటలకు పెంచింది. ఇది షాపులు ,కంపెనీలు ,ఫ్యాక్టరీల్లో రోజువారీ పనులు చేసే వారికి వర్తిస్తుంది.
పనిగంటలు పెంచే సవరణ బిల్లుపై ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎనిమిది గంటల 10 గంటలకు పెంచారు. అయితే, వారానికి 48 గంటలు సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఇక ఫ్యాక్టరీలో బ్రేక్ టైం తో కలిపి 12 గంటలు మించకూడదు. ఇక ప్రతి ఆరు గంటలకు రెస్ట్ ఇవ్వాలి. మహిళలు నైట్ షిఫ్టు రాత్రి 7, రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వారి అనుమతి తప్పనిసరి. అంతేకాదు సంస్థ వారికి ట్రావెల్స్, సదుపాయం సెక్యూరిటీ కూడా కల్పించాల్సి ఉంటుంది.
ఇక ఈ పని గంటల పెంపు సవరణ బిల్లును కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ శాసనసభల ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందింది. అయితే ఇది ఇది వరకు మూడు నెలలకు 75 గంటల ఓవర్ టైం చేసేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు దాని 164 గంటలకు పెంచారు. దీంతో ఓవర్ టైం పరిమితి కూడా పెంచినట్లు సమాచారం. ఇక మహిళలు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది కానీ భద్రతా, రవాణా విషయంలో అయితే తప్పనిసరి. మహిళల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ప్రధానంగా వారికి ఇంటి నుంచి పనికి ప్రత్యేక రవాణా సౌకర్యం కూడా కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన ఈ పనిగంటలు షాపులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు పని చేసే రోజువారీ పని గంటలకు వర్తిస్తుంది.
































