ఏ పని చేసినా సన్మానం, సత్కారం, గుర్తింపు ఉంటే ఆ కిక్కే వేరు. ఈ క్రమంలోనే ప్రతి సినిమా కూడా ఆస్కార్ గెలవాలని అనుకుంటుంది. ఆ కిక్కు సొంతం చేసుకోవాలని కళాకారులు, నిర్మాతలు, దర్శకులు, మొత్తం 24 క్రాఫ్ట్స్ కూడా కోరుకుంటాయి.
ఇప్పటికే తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఘనతను సొంతం చేసుకోగా.. ఈ సారి ఏకంగా ఐదు సినిమాలు ఆస్కార్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్.. ‘పుష్ప 2’, ‘కుబేర’, ‘గాంధీ తాత చెట్టు’, ‘కన్నప్ప’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచినట్లు సమాచారం. కాగా తెలుగు ఫిల్మ్ లవర్స్ ఈసారి సెలబ్రేషన్స్ మామూలగా ఉండవని అంటున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరోవైపు బాలీవుడ్ ఫిల్మ్ ‘హోమ్ బౌండ్’ అధికారికంగా ఇండియా నుంచి ఆస్కార్ రేసులో ఉన్నట్లు ప్రకటించారు మేకర్స్.






























