సినిమా ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు ఉంది.ఇప్పటివరకు వచ్చిన ప్రతి హీరో తమ సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.
‘విశ్వ విఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొన్ని దశాబ్దాల పాటు సేవలను అందించాడు. ఇక ఆయన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లలో బాలయ్య బాబు తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడమే కాకుండ్ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. 65 సంవత్సరాల వయస్సులో కూడా మంచి సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక బాలయ్య బాబు తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెడుతున్నాయి. 18 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి మూడు సినిమాలతోనే టాప్ హీరోగా మారిపోయాడు… ఇప్పటికి తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. పాన్ ఇండియాలో తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు… ఒక బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.
నిజానికి మోక్షజ్ఞ కి సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా తెలుస్తోంది. ఆయనకు బిజినెస్ అంటే చాలా ఇష్టమట. మొదటి నుంచి కూడా తను బిజినెస్ మెన్ అవ్వాలని అనుకుంటున్నాప్పటికి బాలయ్య బాబు మాత్రం నందమూరి ఫ్యామిలీ మూడోతరం వారసుడు నువ్వే అంటూ మోక్షజ్ఞ ను మోటివేట్ చేసి మరి యాక్టింగ్ క్లాసులకు అయితే పంపించాడట…
మొత్తానికి కింద మీద పడి యాక్టింగ్ నేర్చుకున్న ఆయన సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. ఇక ఇంతకుముందు ప్రశాంత వర్మ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికి అటు ప్రశాంత్ నీల్ గాని, ఇటు మోక్షజ్ఞ గాని ఈ సినిమాని చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది.
ప్రస్తుతం వేరే దర్శకుడి డైరెక్షన్ లో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంలో బాలయ్య బాబు అయితే ఉన్నాడు. ఇక ఇదంతా చూస్తున్న నందమూరి ఫ్యామిలీ అభిమానులు అలాగే టిడిపి కార్యకర్తలు సైతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన నందమూరి ఫ్యామిలీ మూడోవతరం వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలను, అందుకుంటున్న సక్సెస్ లను బట్టి చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి అసలైన మూడోతరం వారసుడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది…
































