తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సెలవులు ప్రకటింటాయి.
విద్యార్ధులతో పాటు టీచర్లు కూడా పండగ సెలవులను ఆస్వాధిస్తున్నారు. ఇక దసరా సెలవులు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. తిరిగి అక్టోబర్ 3న అన్ని పాఠశాలలు తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో దసరా సెలవుల పొడిగింపుపై నెట్టింట చర్చ మొదలైంది. దసరా సెలవుల్ని మరో రెండు రోజుల పాటు పొడిగించాలని తీవ్ర ప్రచారం జరుగుతోంది. అ
అక్టోబర్ 2న దసరా పండగ సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 2 పండగైతే.. అక్టోబర్ 3వ తేదీ నుంచే తిరిగి క్లాసులు మొదలవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఊర్లకు వెళ్లిన వారు పండుగ రోజు రాత్రికి రాత్రే ఎలా బయల్దేరి పాఠశాలలకు వస్తారని విద్యార్ధుల తల్లిదండ్రులు సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధులతోపాటు అటు టీచర్లకు కూడా ఇది కష్టసాధ్యమైనంది. అందువల్ల దసరా సెలవుల్ని మరో 2 రోజులు పొడిగించాలని కోరుతున్నారు. అంటే అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు పొడిగించి.. సోమవారం (అక్టోబర్ 6) పాఠశాలలను ప్రారంభించాలని విద్యార్ధులు, తల్లితండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అవసరమైతే రెండో శనివారం పని దినంగా ప్రకటించాలని సూచిస్తున్నారు. తద్వారా దసరా సెలవులకు ఊర్లకు వెళ్లిన విద్యార్ధులు, తల్లితండ్రులు, టీచర్లు కూడా పండుగ రోజున ఠంచన్‌గా తిరిగి స్వస్థలాలకు బయలుదేరకుండా కాస్త నెమ్మదిగా వచ్చే వెసులుబాటు లభిస్తుందని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో దసరా సెలవుల పొడిగింపుపై ప్రభుత్వానికి వినతులు అందుతూనే ఉన్నాయి. కాగా దసరా సెలవుల పొడిగింపుపై ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీల వినతి మేరకు రెండు రోజులు పొడిగించి కాస్త ముందుగానే సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన వెలువరించారు. తాజా వినతులపై సర్కార్ స్పందన ఏమిటో రేపటితో తేలనుంది.
































