రేషన్ కార్డు లబ్ది దారులకు బిగ్ అలర్ట్, ఇలా చేయకుంటే ఇక కార్డులు రద్దు

పీలో రేషన్ వ్యవస్థలో కీలక సంస్కరణలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రారంభించింది. పాత కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తోంది.


అదే విధంగా ఇంటి వద్దకు వచ్చే రేషన్ వాహనాలను రద్దు చేసి తిరిగి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో రేషన్ కార్డు లబ్ది దారులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దీంతో.. లబ్దిదారులు అప్రమత్తం అయ్యారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ కార్డుల పంపిణీ.. పౌర సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ కార్డులను వినియోగంలోకి తీసుకొచ్చారు. రేషన్ దుకాణాలను మినీ స్మార్ట్ బజార్లుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో నిర్వహిస్తోంది. ప్రజల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. ఇక.. ఇదే సమయం లో రేషన్ కార్డు లబ్దిదారులకు అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అదే విధంగా కొన్ని నెలలుగా అధికారులు ఈ కేవైసీ పూర్తి చేయటం పైన సూచనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారి స్మార్ట్ కార్డుల నిలిపివేస్తారని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. కాగా.. రేషన్ కార్డు దారుల్లో అనర్హుల ఏరివేత పైనా కసరత్తు మొదలు పెట్టారు. వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా, ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోయినా వారి కార్డులు రద్దు అవుతాయని అధికారులు చెబుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు, అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-కేవైసీని తప్పనిసరి చేశాయని చెప్పుకొచ్చారు. దీంతో.. రేషన్ లబ్దిదారులు నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.