టూరిస్టులు, ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో కలసి ఆనందంగా గడిపేందుకు ప్రభుత్వం సరికొత్త అడ్వెంచర్ టూరిజంను ఏర్పాటు చేస్తోంది.
ఇకపై పడవలోనే బస చేసే విధంగా హౌస్ బొట్లను అందుబాదులోకి తీసుకురానుంది. ఈ ప్రభుత్వ నిర్ణయంతో కేరళను తలపించేలా హౌస్ బోట్ పర్యాటకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయనుంది. ప్రభుత్వ, ప్రవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఇది ప్రజలకు అందుబాటులో ఉండనుంది. సూర్యలంక , రాజమండ్రి , భవానీ ఐలాండ్ లో సంక్రాంతి నాటికి ఐదు హౌస్ బోట్ లు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడ్వెంచర్ టూరిజంలో భాగంగా వీటిని నడిపేందుకు కేరళతో పాటు ఏపీకి చెందిన కొన్ని ప్రవేట్ సంస్థలు ముందుకొచ్చాయి. మొత్తం పది చోట్ల హౌస్ బోట్ లను నడపాలని అధికారులు ప్రతిపాదించారు.
హౌస్ బోల్స్ అందుబాటులో ఉండే ప్రాంతాలు
ఈ హౌస్ బోట్స్ విజవాడలోని బేరం పార్క్ నుంచి బయలుదేరి భవానీ ద్విపం చుట్టూ తిరిగి పవిత్ర సంగమం వరకు వెళుతోంది .. తర్వాత ప్రకాశం బ్యారేజ్ వరకు వస్తుంది.. భవానీ ఐలాండ్ వద్ద యాంకర్ పాయింట్ పెట్టి బోట్లను రాత్రి నిలిపివేస్తారు.. అందులో పర్యాటకులు బస చేయవచ్చు.. ఉదయం మళ్లీ బయలుదేరి బేరం పార్కుకు బోటు చేరుతుంది.. ఇక రాజమండ్రిలోని పద్మావతి , సరస్వతి ఘాట్‌ల నుంచి బొట్లు బయలుదేరుతాయి.. పిచ్చుకలంక , బ్రిడ్జిలంకల మీదుగా ధవళేశ్వరం వెళతాయి. గోదావరి నది అందాలను తిలకిస్తూ పలు లంకల మీదుగా తిరిగి అదే మార్గంలో బొట్లు వెనక్కి వస్తాయి.
ఒక్కొకమార్గంలో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం చొప్పున బోట్లను నడపనున్నారు.. మధ్యాహ్నం 2 గంటలకు బోటు బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరిగొచ్చేలా ఏర్పాట్లు చేశారు. రాత్రికి బోటులోనే భోజనం , రూమ్ ను కల్పించనున్నారు. ఒక్కో దానిలో నలుగురు చొప్పున ప్రయాణం చేయవచ్చు.. హౌస్ బోటు నడిపేందుకు ముందుకువచ్చిన సంస్థలకు ఏపీ ప్రభుత్వం పర్యాటక విధానం 2024 -2029 ప్రకారం విద్యుత్ రాయితీ, ఏడేళ్ల వరకు ఎన్టిజీఎస్టీ తిరిగి చెల్లింపు , సబ్సిడీలను అందించనుంది.
































