ఏపీలో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ బోర్డు వారికి ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇంటర్మీడియట్ 2025 పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది.
వాస్తవానికి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగిసింది. అయితే గడువును ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
జనరల్, వొకేషనల్ కోర్సులు చదివే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, రెగులర్, ప్రైవేట్ అభ్యర్థులు.. గడువులోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది. థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జికోర్సు సబ్జెక్టుకు రూ.165 చొప్పున చెల్లించాలి. కాగా వెయ్యి రూపాయల అదనపు రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చు. ఇదే చివరి అవకాశం అని, మరోసారి పొడిగింపు ఉండదని ఇంటర్ బోర్డు కార్యదర్శి తేల్చి చెప్పారు.
ఇక, ఇటీవలే ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 24 వరకు జరుగనున్నాయి. అలాగే ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23వ తేదీ వరకు జరుగుతాయి. జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుంది.
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ షెడ్యూల్..
* ఫిబ్రవరి 23న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ – I
* ఫిబ్రవరి 25న ఇంగ్లీష్ పేపర్ – I
* ఫిబ్రవరి 27న హిస్టరీ పేపర్ – I
* మార్చి 2న మ్యాథ్స్ పేపర్ – I
* మార్చి 5న జూలాజీ / మ్యాథ్స్ – IB
* మార్చి 7న కనామిక్స్ – I (Inter First Year Exam Schedule 2026)
* మార్చి 10న ఫిజిక్స్ – I
* మార్చి 12న కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – I
* మార్చి 14న సివిక్స్ – I
* మార్చి 17న కెమిస్ట్రీ – I
* మార్చి 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – I
* మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – I
ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్ షెడ్యూల్..
* ఫిబ్రవరి 24న 2nd లాంగ్వేజ్ పేపర్ – II
* ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్ – II
* ఫిబ్రవరి 28న హిస్టరీ / బోటనీ పేపర్ – II
* మార్చి 3న మ్యాథ్స్ పేపర్ – IIA / సివిక్స్ – II
* మార్చి 6న జూలాజీ – II / ఎకనామిక్స్ – II
* మార్చి 9న మ్యాథ్స్ పేపర్ – IIB
* మార్చి 11న ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – II (Inter Second Year Exam Schedule 2026)
* మార్చి 13న ఫిజిక్స్ – II
* మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – II
* మార్చి 18న కెమిస్ట్రీ – II
* మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – II

































