ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇదొక గొప్ప గుడ్ న్యూస్

 ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుక ప్రకటించింది. నిన్న రోజంతా 14 ఉద్యోగ సంఘాల నేతలతో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిపిన సంగతి తెలిసిందే.


సుదీర్ఘంగా చర్చించారు మంత్రులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. జీఎస్టీ తగ్గింపు దృష్ట్యా ఆదాయాన్ని అంచనా వేసేందుకు మరి కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. అయినా సరే ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సీఎం చంద్రబాబుకు నివేదిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఉద్యోగ సంఘాలు చేసిన విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్నారు సీఎం చంద్రబాబు. శనివారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు. అనంతరం ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెల్లడించారు.

* ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం..
ఉద్యోగులకు మొత్తం నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఒకటి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నవంబర్ 1న ఇచ్చే జీవితంలో కలిపి ఇస్తామని వెల్లడించారు. ఎందుకోసం దాదాపు 160 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. తొలి దశలో ఈ డి ఏ చెల్లింపు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎర్నడ్ లీవులకు సంబంధించి పోలీస్ శాఖలో క్లియరెన్స్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 50 శాతం చెల్లించి.. జనవరిలో మరో 50% చెల్లిస్తామని ప్రకటించారు చంద్రబాబు. రెండు నెలల్లో ఏ ఉద్యోగికి ఇబ్బంది లేకుండా అన్ని సమస్యలు ప్రకటిస్తామని తెలిపారు. ముఖ్యంగా చైల్డ్ కేర్ లీవ్ రిటైర్మెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 180 రోజుల పాటు వాడుకునేలా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

* రేపు అధికారిక ఉత్తర్వులు..
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు దాడి చేస్తామని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. తప్పకుండా దానిని అధిగమించే ప్రయత్నం చేస్తామని.. మున్ముందు ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యాలయ సహాయకుడు, అటెండర్ పోస్టులకు సంబంధించి గౌరవప్రద పైన పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు కూడా ప్రకటించారు. అయితే పిఆర్సి విషయంలో కొంత సమయం అవసరం అన్నారు. ప్రభుత్వానికి వెసులుబాటు కలగగానే దానిపై కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సిపిఎస్ వర్తింపు చేయాల్సి ఉందన్నారు. మంత్రుల కమిటీ అధ్యయనం చేసిన తరువాత మాత్రమే దీనిపై ఒక నిర్ణయం ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఒక డిఏ ప్రకటనపై ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వం కనీసం పట్టించుకోని వైనాన్ని గుర్తు చేస్తున్నారు.
* ప్రభుత్వ కార్యాలయాలకు ఆస్తిపన్నుల నుంచి మినహాయింపులు
* ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులకు సంబంధించి పూర్తి చర్యలు వంటి వాటిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.