పుదీనా, అల్లంతో టీ త‌యారు చేసి తాగండి.. ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు

సీజ‌న్ల మారిన‌ప్పుడు స‌హజంగానే అందరికీ ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల వ‌ల్ల కొందరికి చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతో చాలా ఇబ్బంది ప‌డ‌తారు. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటే ఈ స‌మ‌స్య‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ఆస్త‌మా వంటి స‌మ‌స్య‌లు ఉంటే సీజ‌న్లు మారిన‌ప్పుడు ఇంకా ఎక్కువ అవ‌స్థ క‌లుగుతుంది. ముఖ్యంగా చ‌లికాలంలో అనేక ఇబ్బందులు ప‌డ‌తారు. అయితే ఈ స‌మ‌స్య‌లు అన్నింటికీ చెక్ పెట్ట‌డంతోపాటు ఇత‌ర అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించేందుకు గాను పుదీనా, అల్లం టీ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక పాత్ర‌లో నీటిని పోసి అందులో పుదీనా ఆకులు, అల్లం వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను తాగుతుండాలి. ఇలా టీ త‌యారు చేసి తాగితే అనేక లాభాలు క‌లుగుతాయి. ప‌లు పోష‌కాలు ల‌భించ‌డంతోపాటు అనేక వ్యాధుల‌ను సైతం న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.


జీర్ణ స‌మ‌స్య‌ల‌కు..

పుదీనా ఆకులు, అల్లం వేసి త‌యారు చేసిన టీని సేవిస్తే అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గ‌ర్భిణీల‌కు, ప్ర‌యాణాల్లో వాంతులు అయ్యే వారికి ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాగితే వాంతులు అవ‌కుండా అడ్డుకోవ‌చ్చు. అలాగే ఈ టీలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. క‌నుక దీన్ని సేవిస్తుంటే క‌డుపు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. పొట్ట‌లోని కండ‌రాలు ప్ర‌శాంతంగా మారుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. పొట్ట ప‌ట్టేసిన‌ట్లు ఉండ‌డం, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. అజీర్తి త‌గ్గుతుంది. ఇరిట‌బుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్‌) అనే స‌మ‌స్య ఉన్న‌వారికి ఎంత‌గానో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దీని వల్ల త‌ర‌చూ మ‌ల విసర్జ‌న‌కు వెళ్లే బాధ త‌ప్పుతుంది.

కీళ్ల నొప్పులు, వాపుల‌కు..

ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి, వాపుల‌ను తగ్గిస్తాయి. దీని వ‌ల్ల ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఈ టీలో ఉండే ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. వీటి వ‌ల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కీళ్లు ప‌ట్టుకుపోయిన‌ట్లు ఉండడం తగ్గి రిలాక్స్ అవుతాయి. దీని వ‌ల్ల ఆస్టియో ఆర్థ‌ర‌టైటిస్ స‌మ‌స్య నుంచి సైతం బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కీళ్ల వాపులు తగ్గిపోతాయి. అలాగే ద‌గ్గు, ఫ్లూ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ మిశ్ర‌మంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి. దీంతో క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. ఈ మిశ్ర‌మాన్ని సేవిస్తుంటే షుగ‌ర్ ఉన్న‌వారికి సైతం మేలు జ‌రుగుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ తగ్గుతాయి. శ‌రీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ త‌గ్గి డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.

బ‌రువు త‌గ్గేందుకు..

అల్లం, పుదీనా టీని తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది. ఈ టీని తాగితే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్ర‌మాన్ని సేవించ‌డం వ‌ల్ల ముక్కు దిబ్బ‌డ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. క‌ఫం తొల‌గిపోతుంది. ద‌గ్గు, జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. లివ‌ర్ ఆరోగ్యానికి కూడా ఈ టీ మేలు చేస్తుంది. దీన్ని తాగితే లివ‌ర్ వాపు త‌గ్గుతుంది. లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. లివ‌ర్ క్లీన్ అవుతుంది. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఇలా పుదీనా, అల్లం టీని సేవించ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.