భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దుబాయ్‌ నుంచి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనితను ఆదేశించారు.


ప్రజలకు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.