డిగ్రీ పాసైతే చాలు.. నెలకు రూ.71,000 జీతం

దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న NTPC మైనింగ్ లిమిటెడ్, నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త అందించింది. సుస్థిరమైన కెరీర్‌ను కోరుకునే వారికి, ప్రతిష్టాత్మకమైన ఎగ్జిక్యూటివ్ , అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలోనే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ. 71,000, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులకు నెలకు రూ. 60,000 జీతం అందించబడుతుంది.

ముఖ్యమైన పోస్టులు ,అర్హతలు:

ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్): ఆర్థిక రంగంలో నిపుణులకు అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు, తప్పనిసరిగా CA (చార్టర్డ్ అకౌంటెంట్) లేదా CMA (కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్) ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 30 ఏళ్లు.

ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్): పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశం. అభ్యర్థులు కనీసం 60% మార్కులతో ఎన్విరాన్‌మెంట్ సబ్జెక్టులో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్లు.

అసిస్టెంట్ మైన్ సర్వేయర్: ఈ పోస్టుకు మైన్ సర్వే, మైనింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. వయోపరిమితి 40 ఏళ్లు.

ఎంపిక , వయో సడలింపు:

అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తుకు తుది గడువు:

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోడానికి సిద్ధంగా ఉండండి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 27, 2025 న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 15, 2025.

ఉన్నత జీతం, స్థిరమైన ఉద్యోగం , వృద్ధి అవకాశాలు ఉన్న ఈ అద్భుతమైన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం త్వరలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.