ఫ్రిజ్‌లో గుడ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా? ఐతే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే

గుడ్లు మనం రోజూ ఉపయోగించే ముఖ్యమైన ఆహార పదార్థాలలో ఒకటి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ప్రతిరోజూ ఉడికించిన గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు ఇవి మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను కూడా అందిస్తాయి. కానీ చాలా మంది మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసిన గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహార పదార్థాలు, వినియోగ వస్తువులతోపాటు గుడ్లు ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినడం ఎల్లప్పుడూ మంచిది కాదని అంటున్నారు. గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఏం జరుగుతుంది? వీటిని తింటే ఆరోగ్యానికి మంచిదా కాదా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..


గుడ్లు మనం నిత్యం ఉపయోగించే ఆహారాల్లో ముఖ్యమైనవి. వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ పోషకాల గని అయిన గుడ్లను కూడా కొందరు ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే అన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచినట్లే.. గుడ్లను కూడా ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గుడ్లను వాటి షెల్ఫ్ లైఫ్ కంటే ఎక్కువగా నిల్వ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే వాటిని ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుంది. ఇది అనేక అధ్యయనాల ద్వారా నిరూపించబడింది. గుడ్లను ఎక్కువసేపు ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల పోషకాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వీలైనంత వరకు వాటిని ఫ్రిజ్‌లో ఉంచక పోవడమే మంచిది. అవసరమైతే వాటిని తక్కువ సమయం ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.

గుడ్లను ఫ్రిజ్‌లో ఎందుకు ఉంచకూడదు?

సాధారణంగా పోషకాలు అధికంగా ఉండే గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా విరేచనాలు, వాంతులకు కారణమవుతుంది. గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల అది ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపిస్తుంది. కాబట్టి గుడ్లను 3 నుంచి 5 వారాల కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచకూడదు. నిల్వ చేసినప్పటికీ వాటిని ఫ్రిజ్ దిగువన ఉన్న పెట్టెలో ఉంచాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు గుడ్లను నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.