ఇంటర్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మంచి వేతనం, ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ముఖ్యంగా రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.


రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB NTPC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,058 నాన్‌ టెక్నికల్ పాపులర్‌ కేటగిరీస్‌కి చెందిన (అండర్‌ గ్యాడ్యుయేట్‌) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్‌ 28వ తేదీ నుంచి నవంబర్‌ 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3058

పోస్టులు – వెకెన్సీలు:

కమర్షియల్ కమ్‌ టికెట్‌ క్లర్క్‌: 2,424 ఉద్యోగాలు
అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌: 394 ఉద్యోగాలు
జూనియర్ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌: 163 ఉద్యోగాలు
ట్రైన్స్‌ క్లర్క్‌: 77 ఉద్యోగాలు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి ఇంటర్మీడియట్‌ పాసై ఉంటే సరిపోతుంది. ఈ అర్హత కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

వయస్సు:2026 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు కామెరికల్ కమ్‌ టికెట్‌ క్లర్క్‌కు రూ.21,700, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌కు రూ.19,900, జూనియర్ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌కు రూ.19,900, ట్రైన్స్‌ క్లర్క్‌కు రూ.19,900 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీ, మహిళా, ట్రాన్స్‌ జెండర్‌, మైనార్టీ లేదా ఈబీసీ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 28

దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 27

ఫీజు చెల్లింపుకు చివరి తేది: 2025 నవంబర్‌ 29

దరఖాస్తుకు సవరణ తేదీ: 2025 నవంబర్‌ 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 12 వరకు..

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేసిడ్‌ టెస్ట్‌ (సీబీటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3058

దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 27

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.