తీరం దాటినా శాంతించని మోంథా!.. అప్‌డేట్స్‌

ఆంధ్రప్రదేశ్‌ తీరం సైక్లోన్‌ మోంథా ధాటికి తల్లడిల్లిపోయింది. భారీ నష్టాన్ని కలగజేసి తీరం దాటి.. తీవ్ర తుపాన్‌ కాస్త తుపానుగా మారిపోయి తన ప్రభావం కొనసాగిస్తోంది.


మోంథా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు.

మొంథా తుఫాను.. తెలంగాణ సర్కార్‌ హైఅలెర్ట్‌

నల్లగొండ జిల్లాలో..

బలహీనపడి తెలంగాణ వైపు దూసుకొస్తున్న మోంథా

తీరం దాటాక దిశ మార్చుకున్న మోంథా

తెలంగాణ వైపు దూసుకొస్తున్న తుపాను

భద్రాచలానికి 50కి.మీ. ఖమ్మంకు 110కి.మీ. దూరంలో కేంద్రీకృతం

భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ

ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌లోనూ దంచికొడుతున్న వర్షం

తెలంగాణలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ

వాయవ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరుగంటల్లో బలహీనపడే అవకాశం

కోనసీమ.. ఇళ్లలోకి పాములు!

మోంథా ధాటికి భారీగా పంట నష్టం

మోంథా ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా అన్నిచోట్లా దెబ్బ తిన్న పంటలు

తుపాను ప్రబావంతో చేతికందిన పంట నీటిపాలు

కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వేల ఎకరాలల్లో భారీగా పంట నష్టం

కృష్ణా జిల్లాలో నేలకొరిగిన అరటి బొప్పాయి తోటలు

శ్రీకాకుళంలో 350 హెక్టార్లలో పంట నష్టం

గాలులకు అరటి, కంద, బొప్పాయి తోటలు నష్టం

విజయనగరంలో 7 వేల ఎకరాలు నేలవాలిన వరి

ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం

గుంటూరు, బాపట్ల, పల్నాడులో తడిసి ముద్దైన పత్తి

కన్నీరు పెడుతున్న ఏపీ రైతాంగం

తెలంగాణ ఖమ్మంలో..

అనకాపల్లి జిల్లాలో..

నంద్యాల జిల్లాలో..

శ్రీశైలంలో..

అనకాపల్లి జిల్లాలో..

పల్నాడు జిల్లాలో..

తెలంగాణలో దంచి కొడుతున్న వానలు

బాపట్ల జిల్లాలో..

ప్రకాశం జిల్లాలో..

గూడు ఏమైందో?

కాకినాడ పునరావాస కేంద్రాల వద్ద దయనీయమైన పరిస్థితులు

చలికి వణికిపోతున్న పిల్లలు, వృద్ధులు

బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలు

ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అని గుబులు పడుతున్న వైనం

మోంథా ప్రభావం..

ఎన్టీఆర్ జిల్లా..

కృష్ణా జిల్లాలో..

తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో..

ప్రకాశం జిల్లాలో..

ఖాళీగా విజయవాడ బస్టాండ్‌

రైతులకు కన్నీళ్లు మిగిల్చిన మోంథా

ఏపీలో పంటలపై మోంథా తుపాను ప్రభావం

నేలకొరిగిన వరి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలు

కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా నీట మునిగిన పంట!

శ్రీశైలం పాతాళ గంగ వద్ద తప్పిన ప్రమాదం

శ్రీశైలంలో తప్పిన ఘోర ప్రమాదం

పాతాళ గంగ విరిగిపడ్డ కొండచరియలు

మూడు తాత్కాలిక దుకాణాలు ధ్వంసం

భక్తులెవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

మరో 24 గంటలు వర్షాలే!

మోంథాపై భారత వాతావరణ శాఖ(IMD) తాజా ప్రకటన

ఛత్తీస్‌గడ్‌ దిశగా పయనించి ఈ మధ్యాహ్నానికి బలహీనపడిపోతుంది

మోంథా ప్రభావంతో గంటకు 85-95 కిలోమీటర్ల వేగంతో గాలులు

ఏపీ, తెలంగాణ తోపాటు దక్షిణ ఒడిషా తీర ప్రాంతాలకు మరో 24 గంటలు వర్షాలే

వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం

క్రమంగా బలహీనపడుతున్న మోంథా

విమాన సర్వీసుల పునరుద్ధరణ

ఇంకా భయం గుప్పిట యానాం

అనకాపల్లి జిల్లాలో..

తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాల్లో..

కాకినాడలో..

తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో..

ప్రకాశం జిల్లాలో..

ఎన్టీఆర్ జిల్లాలో..

పార్వతీపురం మన్యం జిల్లాలో..

నెల్లూరు జిల్లాలో..

కృష్ణా జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..

విశాఖపట్నంలో..

నెల్లూరు జిల్లాలో..

అనకాపల్లిలో..

తిరుపతిలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు!

ప్రకాశం జిల్లాలో..

ఏపీని నిండా ముంచిన మోంథా

మోంథా తుపానుతో ఏపీకి తీవ్ర నష్టం

ఓవైపు భీకరగాలులు.. మరోవైపు భారీ వర్షాలు

విరిగిన స్థంభాలు, నేలకొరిగిన వృక్షాలు

పొంగిపొర్లుతున్న వాగులు

రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకూ అంతరాయం

లోతట్టు ప్రాంతాల జలమయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

20 గంటలుగా అంధకారంలోనే పలు ప్రాంతాలు

సెల్‌ టవర్లు దెబ్బ తినడంతో పని చేయని సెల్‌ఫోన్‌ సేవలు

తీవ్రంగా దెబ్బ తిన్న పంటలు

ఐదు రోజులుగా వేటకు దూరమైన మత్య్సకారులు

మోంథా ప్రభావంతో ఈ నెల 31 దాకా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన పలు జిల్లా కలెక్టర్లు

క్రమంగా బలహీనపడుతున్న మొంథా

తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్‌

కృష్ణా జిల్లా..

తెలంగాణ ఖమ్మం జిల్లాలో..

తెలంగాణ వికారాబాద్ జిల్లాలో..

కిరండోల్‌ రైల్వే లైన్‌ ధ్వంసం

ఎన్టీఆర్ జిల్లాలో..

కృష్ణా జిల్లాలో..

నంద్యాల జిల్లాలో..

విశాఖపట్నంలో..

విజయవాడలో..

గుంటూరులో..

భారీ వర్షాలు ఎక్కడంటే..

కోనసీమ జిల్లా..

విజయవాడ..

విజయవాడ..

మోంథా ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 22 సెం.మీ. వర్షం కురిసింది.

మోంథా తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు చోట్ల విద్యుత్‌ స్థంబాలు, చెట్లు నేలకొరిగాయి. జాతీయ రహదారిపై రాత్రంతా వాహనాలను ఎక్కడిక్కడే నిలిపేశారు.

మచిలీపట్నంలో.. తుపాను ధాటికి మచిలీపట్నంలో విద్యుత్‌ వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

నెల్లూరు, బోగూరులో తుపాను ధాటికి గుడిసెలు కుప్పకూఇపోయి ప్రజలు గజగజ వణికిపోయారు

ప్రకాశంలో.. 10 అడుగుల మేర అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది

పలు జిల్లాలోనూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగి రాత్రంతా ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. పలు జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి.

తీవ్ర తుపాన్‌గా తీరం దాటే కోనసీమలో సముద్రం ఉప్పొంగింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం ముందుకొచ్చింది. మామిడికుదురు మండలం కరవాక, గొగన్నమఠం దగ్గరా ముందుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తుపాన్‌ ప్రభావంతో.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖ.. ఇలా 14 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాల ఉంటాయంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.