ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) భారీమార్పునకు సన్నద్ధమవుతోంది. ఈపీఎఫ్, ఈపీఎస్ అర్హత కోసం జీతం పరిమితిని పెంచేప్రతిపాదనపైచర్చించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో సమావేశం కానుంది .
ప్రస్తుతం, నెలకు బేసిక్వేతనంరూ .15,000 వరకు (డీఏతోకలిపి) ఉన్నఉద్యోగులుమాత్రమేతప్పనిసరిగాఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పరిధిలోకి వస్తారు. ఈపీఎఫ్వోఇప్పుడుఈ పరిమితిని రూ .25,000లకు పెంచాలని యోచిస్తోంది. ఇది2014 అనంతరంఅంటేదాదాపు 11 ఏళ్లతర్వాతభారీమార్పుకాబోతోంది.
ఇది అమల్లోకివస్తేభారతదేశ శ్రామిక శక్తిలో చాలా మంది ఈపీఎఫ్ ఈపీఎస్ ప్రయోజనాలను పొందుతారు. అంటే ఇప్పుడుపదవీ విరమణ, పెన్షన్ భద్రత కోల్పోతున్నలక్షలాది మంది మళ్లీవాటిపరిధిలోకివస్తారు.
ప్రస్తుత వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. ఉద్యోగి, యాజమాన్యంఇద్దరూ ఉద్యోగి నెలవారీ బేసిక్జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్కుజమచేస్తారు. ఇక్కడయాజమాన్యంవాటా మళ్లీవిభజిస్తారు. 3.67 శాతం ఈపీఎఫ్‌కు వెళుతుంది. 8.33 శాతం ఈపీఎస్కుకేటాయిస్తారు.
ఇకనెలవారీజీతంలోబేసిక్పే రూ .15,000 దాటినవారికిఈపీఎఫ్ కవరేజీతప్పనిసరికాదు. అంటేఈపీఎఫ్కవరేజీకావాలంటేతీసుకోవచ్చు. వద్దనుకుంటేవిరమించుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.6 కోట్ల క్రియాశీల సభ్యులతో రూ .26 లక్షల కోట్ల భారీ నిధిని నిర్వహిస్తోంది. ఈ మార్పు ఇప్పటికేఆలస్యమయ్యాయని, కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. జీతాలతోపాటుద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉన్ననేపథ్యంలోపాత నిబంధనలు నేటి వాస్తవికతకు సరిపోవు. కొత్త పరిమితి అమల్లోకివస్తేమరింతమందికార్మికులకుపదవీ విరమణ అనంతర రక్షణను పొందడానికి సహాయపడుతుంది.
































