ఈఎంఐ Vs రెంట్: ఈ రెండింటిలో ఏది బెస్ట్.. ఇలా ప్లాన్ చేస్తే లక్షల్లో ఆదా..

సొంత ఇంటి కోసం ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాలా లేక అద్దెకు ఉండటం చౌకనా అనే నిర్ణయం ఆర్థికంగా చాలా ముఖ్యం. ఇది అంత సులభమైన నిర్ణయం కాదు.. ఎందుకంటే రెండింటికీ లాభాలు, నష్టాలు ఉన్నాయి. అద్దెకు ఉండటం వల్ల తక్షణ ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం ఉండదు. ఈఎంఐలు మొదట్లో భారంగా అనిపించినా, కట్టిన ప్రతి పైసా మీ సొంత ఆస్తిగా మారుతుంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్..? అనేది తెలుసుకుందాం..

ఇంట్లో అద్దెకు ఉండడానికి మొదట్లో పెద్ద డబ్బు అవసరం ఉండదు. దీంతో ఆర్థికంగా ఉపశమనం దొరుకుతుంది. అయితే ప్రతి సంవత్సరం అద్దె పెరుగుతుంది. చివరకు మీరు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఎటువంటి ఆస్తిగా మారదు. అద్దె స్వల్పకాలంలో చౌకగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఇది మీపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది


మొదట్లో అద్దె కంటే ఈఎంఐ ఎక్కువ అనిపించినా.. కట్టిన ప్రతి పైసా మీ సొంత ఆస్తిగా మారుతుంది. కొన్ని ఏళ్ల తర్వాత ఆ ఇల్లు మీకు పెద్ద ఆస్తి అవుతుంది. దాని విలువ పెరిగితే మీకు మరింత లాభం వస్తుంది. అందుకే ఈఎంఐని నేటి ఖర్చుగా కాకుండా రేపటి ఆదాయంగా చూడాలి.

ఎప్పుడు ఏది మంచిది?: మీకు స్థిరమైన ఉద్యోగం, మంచి జీతం ఉంటే ఈఎంఐ మంచిది. మీ ఉద్యోగం పర్మినెంట్‌గా లేకపోతే.. తరచుగా ఊర్లు మారాల్సి వస్తే లేదా మీ దగ్గర తక్కువ డబ్బు ఉంటే మీకు ఈఎంఐ కట్టడం భారంగా ఉంటుంది. ఈ సమయంలో అద్దె అయితే మీకు ఫ్రీడమ్ ఉంటుంది. ఆర్థిక స్థిరత్వాన్ని బట్టి ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి.

మీరు EMI కడితే పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇది మీకు పెద్ద లాభం. అద్దెకు అలాంటి పన్ను లాభాలు ఉండవు. తరుచూ ట్రాన్స్‌ఫర్లు అయ్యేవారికి ఇల్లు అమ్మడం, కొనడం వంటివి అద్దె వల్ల తప్పుతాయి.

తెలివైన వ్యూహం: మీరు ఒక ఇల్లు కొని.. దాన్ని అద్దెకు ఇవ్వండి. ఆ అద్దె డబ్బుతో మీ ఇంటి EMI కట్టండి. తక్కువ అద్దెకు వేరే చోట మీరు ఉండవచ్చు. దీని వల్ల మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. మీకు నెలవారీ ఖర్చు కూడా తగ్గుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.