బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసింది. నెలకు రూ.21,700- రూ.69,100 వరకు వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు.
టెన్త్ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అర్హులైన ఆసక్తి కలిగిన పురుషులు, మహిళ క్రీడాకారులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అయితే దరఖాస్తులు పంపేందుకు నవంబర్ 4వ తేదీతో గడువు ముగియనుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక సహా పలు వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ సరిహద్దు ప్రాంతాల్లో నియమించబడతారు. ట్రైనింగ్ సమయంలో ప్రభుత్వం భోజనం, నివాసం, మెడికల్ సదుపాయాలను ఉచితంగా అందిస్తుంది. అభ్యర్థులు తమ క్రీడా సర్టిఫికెట్లను సరైన రీతిలో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
మొత్తం పోస్టులు..
391 ( పురుషులు 197, మహిళలు 194 )
స్పోర్ట్స్ విభాగాల వారీగా అవకాశాలు..
దాదాపు 20కి పైగా క్రీడా విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
- అథ్లెటిక్స్
- బాక్సింగ్
- బాస్కెట్‌బాల్
- హాకీ
- ఫుట్‌బాల్
- స్విమ్మింగ్
- షూటింగ్
- జూడో
- కరాటే
- రెజ్లింగ్
- వెయిట్ లిఫ్టింగ్ వాలీబాల్
- హ్యాండ్ బాల్
- టేబుల్ టెన్నిస్
- ఆర్చరీ
- బ్యాడ్మింటన్
- సైక్లింగ్
జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో 2023 నవంబర్ 4 నుంచి 2025 నవంబర్ 4 మధ్యలో పతకాలు సాధించిన లేదా పాల్గొన్న స్పోర్ట్స్ వ్యక్తులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే వారు క్రీడల్లో ప్రతిభావంతులుగా ఉండాలి.
వయస్సు పరిమితి..
18 సంవత్సరాలు నుంచి 23 సంవత్సరాలు (2025 ఆగస్టు 1 నాటికి) మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయస్సు సడలింపు లభిస్తుంది.
జీతం..
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది. అదనంగా, BSF సిబ్బందికి ప్రభుత్వ భత్యాలు, మెడికల్ సదుపాయాలు, కుటుంబ భత్యాలు, పెన్షన్ లాంటి అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం..
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా..
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా మెరిట్ లిస్ట్
- సర్టిఫికేట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్ వంటి దశలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు..
జనరల్ & OBC పురుష అభ్యర్థులు: రూ.159
SC/ST/మహిళ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు



































