ఇప్పుడు ఇంట్లో కూర్చునే బిజినెస్‌కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెట్ వేగంగా పెరుగుతుండటంతో, డ్రాప్‌షిప్పింగ్ మొదలుపెట్టాలనుకునే వారికి సరైన దారి. తక్కువ పెట్టుబడితో, పెద్ద రిస్క్ లేకుండా ఈ బిజినెస్ మొదలుపెట్టవచ్చు. ఇపుడు ఇది ఎలా పని చేస్తుందో, ఎలా మొదలు పెట్టాలో వివరంగా తెలుసుకోండి.
డ్రాప్‌షిప్పింగ్ అనేది ఒక ఆన్‌లైన్ వ్యాపారం చేసే విధానం. ఉదాహరణకు మీరు దుస్తులు అమ్మాలని అనుకుంటే, సాధారణంగా షాప్ అద్దెకు తీసుకుని, దుస్తులు కొని, స్టాక్ ఉంచి అమ్మాలి. కానీ డ్రాప్‌షిప్పింగ్‌లో అలా అవసరం లేదు. మీరు కేవలం ఒక ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి, అమ్మాలనుకున్న దుస్తుల ఫోటోలు పెడతారు
కస్టమర్ మీ వెబ్‌సైట్‌లో రూ.1500కి షర్ట్ ఆర్డర్ చేస్తే, మీరు ఆ ఆర్డర్‌ను సప్లయర్‌కి పంపుతారు. సప్లయర్ ఆ షర్ట్‌ను రూ.1000కి ఇస్తాడు, అంటే మీకు రూ.500 లాభం. సప్లయర్ ఆ షర్ట్‌ను నేరుగా కస్టమర్ అడ్రస్‌కి పంపిస్తాడు. మీరు స్టాక్ పెట్టకుండానే బిజినెస్ చేయగలరు. ఈ విధంగా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, కిచెన్ ఐటమ్స్ లాంటి ఏ ప్రొడక్ట్‌నైనా డ్రాప్‌షిప్పింగ్ ద్వారా అమ్మొచ్చు.
ముందుగా మీరు ఏ ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. మీ టార్గెట్ మార్కెట్ ఏదో బట్టి ప్రొడక్ట్స్ ఎంచుకోవడం ముఖ్యం. తర్వాత సప్లయర్స్ ఎక్కడ కనుక్కోవాలో నిర్ణయించాలి. ఇండియాలో GlowRoad, BizzTM, IndiaMART లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో సప్లయర్స్ దొరుకుతారు. బేగం బజార్ లాంటి హోల్‌సేల్ మార్కెట్లలో కూడా సరఫరాదారులు ఉంటారు. చీరల వ్యాపారం చేయాలంటే సూరత్‌లో మంచి సప్లయర్స్ దొరుకుతారు. తక్కువ ధరలో నాణ్యమైన ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలి.
తర్వాత ఆన్‌లైన్ స్టోర్ సెట్ చేయాలి. సులభంగా మొదలు పెట్టాలంటే Shopify ఉపయోగించవచ్చు. కొంచెం టెక్నికల్‌గా తెలుసుంటే WooCommerce కూడా వాడొచ్చు. స్థానిక భాషలో .in డొమైన్ తీసుకోవడం మంచిది. చాలా మంది మొబైల్ ఫోన్‌ద్వారా వెబ్‌సైట్ చూస్తారు కాబట్టి, మొబైల్‌ఫ్రెండ్లీ డిజైన్ చేయాలి. పేమెంట్ గేట్‌వే కూడా ఇంటిగ్రేట్ చేయాలి. Razorpay, Cashfree, PayU లాంటివి సులభంగా ఉపయోగించవచ్చు. ఇవి UPI, డెబిట్ కార్డులు, వాలెట్ల ద్వారా పేమెంట్స్ స్వీకరిస్తాయి. సెమీ అర్బన్ ప్రాంతాలను టార్గెట్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా అవసరం.
రూ.5 లక్షల బడ్జెట్‌తో వ్యాపారం ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. డొమైన్, హోస్టింగ్‌కి ఏడాదికి రూ.4,000 ఖర్చవుతుంది. Shopify నెలసరి ఛార్జీలు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు ఉంటాయి. WooCommerce సెటప్ చేయడానికి రూ.10,000 నుంచి రూ.15,000 ఖర్చవుతుంది. వెబ్‌సైట్ డిజైన్, బ్రాండింగ్‌కి రూ.15,000 నుంచి రూ.25,000 అవసరం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, ఇన్ఫ్లూయెన్సర్ ప్రమోషన్స్ కోసం మొదటి నెల రూ.75,000 కేటాయించాలి.
కొద్దిపాటి స్టాక్ కోసం రూ.20,000 పెట్టాలి. ఇన్వెంటరీ, ఆర్డర్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌కి నెలకు రూ.10,000, కస్టమర్ సపోర్ట్ టూల్స్‌కి రూ.3,000 ఖర్చవుతుంది. ప్యాకేజింగ్‌కి రూ.15,000 నుంచి రూ.20,000, లీగల్ పనులకు రూ.7,500 నుంచి రూ.10,000 అవసరం. రిజర్వ్‌గా రూ.2 లక్షలు ఉంచుకోవాలి.
రోజుకు 20 ఆర్డర్స్ వస్తే, నెలకు 600 ఆర్డర్స్ అవుతాయి. ప్రతి ఆర్డర్ నుంచి రూ.400 లాభం వస్తే మొత్తం రూ.6 లక్షల ఆదాయం వస్తుంది. అందులో సప్లయర్ ఖర్చులు రూ.3.6 లక్షలు, యాడ్స్ రూ.50,000, పేమెంట్ గేట్‌వే చార్జీలు రూ.12,000, రీఫండ్స్ రూ.30,000, ఇతర ఖర్చులు రూ.20,000 తీసేస్తే సుమారు రూ.1.28 లక్షల లాభం వస్తుంది.
లీగల్ విషయాల్లో GST రిజిస్ట్రేషన్ తప్పనిసరి. విదేశీ సరఫరాదారులతో వర్క్ చేయాలంటే IEC కోడ్ అవసరం. MSME (ఉద్యమ్) రిజిస్ట్రేషన్ ఐచ్చికం. తెలంగాణలో TG-iPASS, ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ విండో పోర్టల్ ద్వారా బిజినెస్ రిజిస్ట్రేషన్ సులభం. బిజినెస్ పెంచుకోవాలంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ తెలుగులో చేయండి. స్థానిక ఇన్ఫ్లూయెన్సర్లతో ప్రమోషన్ చేయడం వల్ల నమ్మకం పెరుగుతుంది.
డ్రాప్‌షిప్పింగ్ చిన్న స్థాయిలో మొదలైనా స్థిరమైన ఆదాయం ఇస్తుంది. సరైన ప్లాన్, నమ్మకమైన సరఫరాదారులు, స్థానిక మార్కెట్‌కి తగిన ప్రొడక్ట్స్ ఉంటే ఈ వ్యాపారంలో విజయవంతం కావచ్చు. యువత, గృహిణులు, స్టూడెంట్స్ ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించి ఆన్‌లైన్ వ్యాపారం మొదలుపెట్టవచ్చు.
































