మరో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా క్రాష్

వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. తాజాగా, అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌విల్లే ముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్కడి కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం బయలుదేరిన యూపీఎస్ ఫ్లైట్ 2976 మెక్‌డొనెల్ డగ్లస్ MD-11F కార్గో విమానం టేకాఫ్‌లోనే కూలిపోయి భారీ పేలుడుకు గురైంది.


హవాయి రాష్ట్రంలోని హొనోలులు డేనియల్ కె. ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఆ ఫ్లైట్‌లో మొత్తం ముగ్గురు సిబ్బంది ఉన్నారు. అందులో దాదాపు 280,000 పౌండ్ల (సుమారు 42,000 గ్యాలన్లు) జెట్ ఇంధనం ఉండటంతో పేలుడు తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం ముగ్గురు మరణించగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని విమాన శకలాలను తొలగిస్తున్నారు. అయితే, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.