రోజువారీ వంటకాల్లో టమోటాలు ఉపయోగించడం దాదాపు ప్రతి ఇంట్లో ఉండే అలవాటే. కొందరు చిన్నపిల్లలు, పెద్దలు టమోటాలు పచ్చిగా కూడా తింటారు. టమోటాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ టమోటా గింజలు ఆరోగ్యానికి హానికరమా లేదా ప్రయోజనకరమా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
టమోటా గింజలు యాంటీఆక్సిడెంట్లు, ఫినాలిక్ సమ్మేళనాలకు మంచి మూలం. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టమోటా గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వాటిలో కొన్ని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
టమోటా విత్తనాలలో లైకోపీన్, బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. విత్తనాలలోని పోషకాలు రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయపడతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఈ గింజల్లోని విటమిన్లు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అందుకే చాలా మంది టమోటాలు ,దా టమోటా సూప్ మాత్రమే తాగుతారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండాలి.
అసిడిటీ, కడుపులో గ్యాస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్నవారు టమోటా గింజల వల్ల ఇబ్బంది పడవచ్చు. కాబట్టి అసిడిటీ, కడుపులో గ్యాస్ లేదా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకూడదు.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉన్నవారు కూడా టమోటాలు తినకుండా ఉండాలి. టమోటా గింజల్లో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
































