‘స్పిరిట్’ లో చిరంజీవి క్యారక్టర్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ వంగ.. ఫ్యాన్స్ కి ఇక పండగే

రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie).


యానిమల్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగ(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న చిత్రం కావడం తో మన టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా పై ఆసక్తి ఎక్కువ. ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మెక్సికో లో ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ మొదలు కానుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రభాస్ కి తండ్రి క్యారక్టర్ చేస్తున్నాడని, డేట్స్ కూడా ఇచ్చేసాడని, ఆయన క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన ఆడియో గ్లింప్స్ లో ప్రభాస్ నోటి నుండి వచ్చే బ్యాడ్ హ్యాబిట్ సెంటిమెంట్ చిరంజీవి క్యారక్టర్ కి సంబంధించినదే అని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే రీసెంట్ గానే ఒక ప్రముఖ బాలీవుడ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్ వంగ ని రిపోర్టర్ చిరంజీవి క్యారక్టర్ కి సంబంధించిన ప్రశ్న అడగ్గా, సందీప్ వంగ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. ‘స్పిరిట్ చిత్రం లో చిరంజీవి గారు ఎలాంటి క్యారక్టర్ చేయడం లేదు. ఇది సోషల్ మీడియా లో పుట్టుకొచ్చిన రూమర్ మాత్రమే. చిరంజీవి గారితో నేను చేస్తే సోలో యాక్షన్ ఫిలిం ని చేస్తాను, ఇలా ప్రత్యేక పాత్రలతో సంతృప్తి చెందను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా సందీప్ వంగ తో చిరంజీవి సినిమా కచ్చితంగా ఉంటుందని, పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మరోసారి షేక్ అవుతాయని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్వీట్స్ వేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే సందీప్ వంగ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు వీరాభిమాని అనే విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి కి సినిమానే ప్రపంచం, వేరే ప్రపంచం తెలియదు కాబట్టి ఆయనతో భవిష్యత్తులో కచ్చితంగా సినిమా చేసే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి అలా కాదు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ గా ఉన్నాడు. మరో పక్క సినిమాలు కూడా చేస్తున్నాడు కానీ, ఆయన ఇచ్చే డేట్స్ చాలా తక్కువ , కాబట్టి సందీప్ వంగ లాంటి ప్రొఫైల్ ఉన్న డైరెక్టర్స్ తో పవన్ పని చేయడం కష్టమే. కానీ పవన్ కళ్యాణ్ తో కాకపోయినా, చిరంజీవి తో చేసే అవకాశం ఉంది కదా, రామ్ చరణ్ తో కూడా చేయబోతున్నాడని అంటున్నారు, కాబట్టి మెగా ఫ్యాన్స్ అయినా మాకు రాబోయే రోజులన్నీ మంచి రోజులే అంటూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.