జాతి రత్నాలతో.. ఈ రాశుల వారికి దశ తిరగడం ఖాయం

జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు రాశ్యదిపతి అనుకూల స్థానంలో ఉన్నా, రాశ్యధిపతి మీద గురువు దృష్టి ఉన్నా ఒక పట్టాన పురోగతి కనిపించదు. ఇటువంటి రాశుల వారు ఇతర పరిహా రాల కంటే ఎక్కువగా వారికి అనుకూలమైన జాతి రత్నాలను ఉంగరంలో ధరించడం చాలా మంచిది.


తప్పకుండా జీవితంలో అంచనాలకు మించి పురోగతి లభిస్తుంది. ప్రస్తుత గ్రహ సంచా రాన్ని బట్టి రాశ్యధిపతి ఏ స్థితిలో ఉన్నదీ, ఎందుకు అవాంతరాలు, అవరోధాలు కలుగుతున్నదీ పరిశీలించి జాతి రత్నాలను సూచించడం జరిగింది. మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారు ఉంగరంలో సరైన రత్నం ధరించడం వల్ల లబ్ధి పొందుతారు.

  1. మేషం: ఈ రాశికి రాశ్యదిపతి కుజుడు తనకు మరో స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది కానీ, అది మేష రాశికి అష్టమ స్థానం అయినందువల్ల ముఖ్యమైన పనులు, ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా కలుగుతుంటాయి. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.

    వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిపాటి అసంతృప్తికి అవకాశం ఉంది. ఈ రాశివారు ఉంగరంలో పగడాన్ని పొదిగించి ధరించడం వల్ల జీవితమంతా ఆశించిన విధంగా విజయాలతో సాగిపోతుంది.

  2. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు తనకు మరో స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఇది షష్ట స్థానమైనందువల్ల జీవితంలో పురోగతి మందకొడిగా సాగుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందకపోవచ్చు.

    ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగవు. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడి జీవితమంతా హ్యాపీగా సాగాలన్న పక్షంలో వీరు వజ్రాన్ని ధరించడం మంచిది.

  3. సింహం: రాశ్యధిపతి కుజుడు ప్రస్తుతం నాలుగవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొద్దిపాటి కుజ దోషం కలిగింది. కుటుంబంలో సుఖ శాంతులు తగ్గి టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది.

    జీవిత భాగస్వామితో తరచూ వాదోపవాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో జాప్యానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.ఈ రాశివారు ఉంగరంలో పగడాన్ని ధరించడం వల్ల జీవితమంతా విజయాలు, సాఫల్యాలు, సుఖాలు, సరదాలతో సాగిపోతుంది.

  4. కన్య: రాశ్యధిపతి బుధుడు తనకు శత్రు క్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. పైగా రెండు నెలల పాటు వక్ర సంచారం చేయడం కూడా జరుగుతుంది.

    దీనివల్ల ఎటువంటి నైపుణ్యాలు కలిగి ఉన్నా, ఎంతటి సమర్థత ఉన్నా ఉపయోగం ఉండదు. కొన్ని విషయాల్లో తిరోగమనం అనుభవానికి వస్తుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ రాశివారు మరకతం (పచ్చ) ధరించడం వల్ల వీరి ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి.

    విజయాలు ఎక్కువగా ఉంటాయి.

  5. ధనుస్సు: రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్నప్పటికీ రాశ్యధిపతి అనుకూలంగా లేనందువల్ల ప్రతి ప్రయత్నమూ నిష్ఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఒక్కోసారి ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంటుంది.

    వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడి, పురోగతి సాధించడానికి వీరు పుష్యరాగం ధరించడం మంచిది.

  6. మకరం: రాశ్యధిపతి శనీశ్వరుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఏ రంగంలో ఉన్నా పురోగతి చెందడానికి ఆస్కారముంటుంది. అయితే, ఇతర గ్రహాల యుతి, దృష్టి కారణంగా తరచూ శనికి బలం తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆదాయ వృద్ధికి ఎక్కువగా శ్రమ పడడం, ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో శ్రమ, తిప్పట, కాలయాపనలకు అవకాశం ఉండడం జరుగుతుంది. ఈ పరిస్థితిని నివారించడానికి వీరు ఇంద్ర నీలం అనే రత్నాన్ని ఉంగరంలో పొదిగి ధరించడం మంచిది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.