ట్రంక్ పెట్టెలో పాత పేపర్లు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. లక్ష.. ఇప్పుడు రూ. 85 కోట్లు

స్టాక్ మార్కెట్ అనేది ఓ వైకుంఠపాళీ. ఏ సమయంలో పాముకు చిక్కుతామో.. ఏ సమయంలో నిచ్చెన ఎక్కుతామో ఎవ్వరం చెప్పలేం. అయితే ఇక్కడ పామును హైరిస్క్-హైరివార్డు స్టాక్స్‌తో పోల్చితే..


మంచి స్టాక్స్ నిచ్చెన అనుకోవచ్చు. అంటే.. మంచి స్టాక్స్ కొంటే ఎప్పటికైనా లాభాల బాట పడతామని అర్ధం. సరిగ్గా ఇందుకు నిదర్శనంగా ఈ ఉదాహరణ నిలుస్తుంది. ఓ వ్యక్తి తన తండ్రి దాచిపెట్టిన స్టాక్స్ ఇప్పుడు వెలికితీయగా.. అవి ఏకంగా రూ. 85 కోట్లు పలుకుతాయని తేలింది.

పోస్ట్ ప్రకారం.. సదరు వ్యక్తి తండ్రి జిందాల్ విజయనగర్ స్టీల్‌ సంస్థ 5 వేల షేర్స్ 1995లో కొనుగోలు చేశాడు. అవి అప్పుడు రూ. లక్ష కాగా.. ఇప్పుడు ఆ షేర్స్ విలువ ఏకంగా రూ. 85 కోట్లుగా తేలింది. అదెలాగని ఆలోచిస్తున్నారా.?

2005లో, JVSL.. JSW స్టీల్‌తో విలీనం అయింది. ఆ సమయంలో JVSLలో 1 షేర్ ఉన్న ప్రతీ వ్యక్తికి 16 JSW షేర్లు లభించాయి. అంటే..! ఈ 5 వేల షేర్స్ కాస్తా.. 80 వేల షేర్స్‌గా మారాయి. ఆ తర్వాత JSW 1:10 స్టాక్ స్ప్లిట్ అవ్వడంతో.. అవి 8 లక్షల JSW స్టీల్ షేర్స్‌గా మారాయి. ఇప్పుడు వాటి విలువ రూ. 80.4 కోట్లు కాగా.. డివిడెండ్స్ రూపంలో మరో రూ. 5 కోట్లు వచ్చాయి. వెరిసి మొత్తం షేర్స్ వాల్యూ రూ. 85 కోట్లు అయింది. చూశారా.! కాంపౌండ్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే.. మంచి షేర్స్‌లో పెట్టుబడి పెడితే.. కచ్చితంగా మనకు లక్షలు వచ్చిపడతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.