విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

విజయవాడ కరెన్సీ నగర్‌లోని పలు హోటల్స్‌, రెస్టారంట్స్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ప్రమాణాలు పాటించని  ఓ హోటల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కాలం చెల్లిన శీతల పానీయాలు అమ్ముతున్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వాటిని సీజ్‌ చేశారు. ఆహారంలో సింథటిక్ కలర్స్, టెస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.  వీనియోగదారులకు నాసిరకం ఆహారం అందిస్తున్నట్లు గుర్తించి హోటల్‌ యజమానికి నోటీసులు అందించారు. శుభ్రత, ప్రమాణాలు పాటించని హోటల్స్, దుకాణాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.