చలికాలంలో ఈ పండ్లు అస్సలు తినకూడదు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

చలికాలంలో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మారుతున్న వాతావరణానికి తగ్గట్టుగా మన ఆరోగ్య అలవాట్లు కూడా మార్చుకోవాలి. అలాగే కొన్ని పండ్లు కూడా తినకండా ఉంటే మంచిది. చలికాలంలో మీరు ఈ పండ్లకు దూరంగా ఉండటం ఉత్తమం.


చలికాలం రాగానే వేడివేడి కాఫీలు, కంఫర్ట్‌నిచ్చే స్వెటర్లు గుర్తొస్తాయి. కానీ మనం తినే పండ్ల విషయంలో కూడా కాస్త శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే, ఆరోగ్యానికి మంచివని మనం భావించే కొన్ని పండ్లు ఈ చలిలో మన శరీరంపై వ్యతిరేక ప్రభావం (Fruits Not to Eat in Winter) చూపిస్తాయి. అవి దగ్గు, జలుబు వంటి సమస్యలకు ఎలా కారణమవుతాయో చూద్దాం.

కఫాన్ని పెంచేసే కొబ్బరి నీళ్లు..: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనందరికీ తెలుసు. కానీ చలికాలంలో మాత్రం దీనితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం దీనికి చలువ చేసే గుణం ఉంది. చల్లగా ఉండే కొబ్బరి నీళ్లను ఈ సీజన్‌లో తాగడం వల్ల అది శరీరంలో కఫం లేదా శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది. మీకు ఇప్పటికే దగ్గు, ఆస్తమా, లేదా ఛాతీలో పట్టేసినట్టు ఉండే సమస్యలు ఉంటే, ఈ పానీయం మీ లక్షణాలను మరింత తీవ్రం చేస్తుంది.

కీరదోస, పుచ్చకాయ (Cucumber, Watermelon)..: ఎండాకాలంలో మన పాలిట వరం ఈ పండ్లు. కానీ చలికాలంలో మాత్రం వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే, వీటిలో నీటిశాతం చాలా ఎక్కువగా ఉండటం, శరీరానికి చలువ చేసే గుణం ఉండటం వల్ల ఇవి సమస్యగా మారతాయి. చలికాలంలో వీటిని తింటే, మన శరీరం లోపల ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. దీనివల్ల బయటి చలికి శరీరం త్వరగా లొంగిపోతుంది. ఫలితంగా, దగ్గు, గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అవకాడో..: అవకాడో (Avocado) ఒక పోషకాల గని. ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా, ఇది కూడా చలికాలంలో కొంతమందికి సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇందులో ‘హిస్టమైన్’ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సున్నితమైన శరీర తత్వం ఉన్నవారిలో అలర్జీలను ప్రేరేపిస్తాయి. ఇప్పటికే సైనస్, అలర్జీలతో ఇబ్బంది పడేవారు దీన్ని తింటే తుమ్ములు, ముక్కు కారడం వంటి సమస్యలు ఎక్కువ కావచ్చు. అంతేకాక, ఇది చాలా రిచ్‌గా, బరువుగా ఉండటం వల్ల ఛాతీలో పట్టేసిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది.

ద్రాక్ష, స్ట్రాబెర్రీలు..: ద్రాక్ష, స్ట్రాబెర్రీలు (Grapes, Strawberries) చాలా రుచిగా ఉంటాయి, కానీ చలికాలంలో వీటిని ఎక్కువగా తినకపోవడమే ఉత్తమం. వీటికి కూడా చలువ చేసే తత్వం ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో ‘కఫ దోషాన్ని’ పెంచుతాయి. అంటే, కఫం, శ్లేష్మం వంటి సమస్యలను ఎక్కువ చేస్తాయి. ఒకవేళ మీరు ఇప్పటికే జలుబు, దగ్గుతో బాధపడుతుంటే, ఈ పండ్లు కఫాన్ని చిక్కగా మార్చి ఛాతీలో బరువుగా, గొంతులో ఇబ్బందిగా అనిపించేలా చేస్తాయి.

నారింజ (Orange)..: విటమిన్ C ఉందని చలికాలంలో నారింజ పండ్లు ఎక్కువగా తింటుంటాం. కానీ వీటిలోని పులుపు గుణం ఇప్పటికే గొంతునొప్పి, దగ్గుతో బాధపడేవారి సమస్యను మరింత పెంచుతుంది. అలాగే, వీటికి సహజంగా చలువ చేసే తత్వం ఉండటం వల్ల జలుబు త్వరగా తగ్గకుండా చేస్తుంది.

అరటిపండు..: అరటిపండు (Banana) కఫాన్ని పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది. మీకు ఇప్పటికే దగ్గు, జలుబు, లేదా ఆస్తమా వంటి సమస్యలు ఉంటే, ఇది శ్లేష్మాన్ని పెంచి మీ ఇబ్బందిని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో దీనికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం.

బేరిపండు (Pear)..: ఈ పియర్ పండు కూడా శరీరానికి చలువ చేస్తుంది. ఇది జలుబు లక్షణాలను పెంచి, కొంతమందిలో గొంతులో గరగర లేదా అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అందుకే దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ పండును మితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం మంచిది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.