తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ.. ఎక్కడంటే..?

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ మేరకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల ఒక ప్రకటనలో తెలిపారు.రైతులకు తేనెటీగల పెంపకం, తేనె సేకరణ పలు అంశాలపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.


తేనెటీగల పెంపకం అనేది తేనె తీగల కాలనీలను పెంచడం లేదని నిర్వహించడం ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ దీనిని ఎపికల్చర్ అని అంటారు.తేనెటీగల పెంపకం ద్వారా దీని మైనం,పుప్పడి వంటి ఉత్పత్తులు లభిస్తాయి మరియు మొక్కల పరాగసంపర్కానికి ఇది చాలా సహాయపడుతుంది.దీని కోసం తేనె తీగలు పెంచే కృతిమ తేన తీగల లేదా సహజ తీగలను ఉపయోగిస్తారు.వీటిని పెంచేందుకు కావలసిన పరికరాలను సేకరించాలి.పెంపకానికి మంచి లక్షణాలున్న తేనె తీగలను ఎంచుకోవాలి.తేనె తీగల పట్టులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ నిర్వహించాలి. తేనెటీగలను పెంచడానికి అవగాహన శిక్షణ పొందడం చాలా ముఖ్యం.

కొన్ని ప్రభుత్వ శాఖలు మరియు సంస్థలు ఉచితంగా తేనె తీగల పెంపకంపై శిక్షణ అందజేస్తున్నాయి.ఈ శిక్షణలో తేనె తీగల పెంపకానికి సంబంధించిన మెలుకువలు మార్కెటింగ్ వంటి అంశాలను బోధిస్తారు.రైతులకు అనుబంధ రంగాల్లో ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సైతం ఉచిత కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ మేరకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల ఒక ప్రకటనలో తెలిపారు.రైతులకు తేనెటీగల పెంపకం, తేనె సేకరణ పలు అంశాలపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.తేనెటీగల పెంపకం తేనె సేకరణ విక్రంతో రైతులకు ఉపాధి లభిస్తుందన్నారు.

తేనె తీగల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు నిరుద్యోగులు ఈ శిక్షణలో పాల్గొనవచ్చన్నారు.శిక్షణలో పాల్గొనే వారికి తేనెటీగల పెంపకంలో మెలకువలు, మార్కెటింగ్ వంటి తదితర అంశాలను బోధిస్తారు. శిక్షణలో పాల్గొనే వారికి ప్రభుత్వ రాయతీ సదుపాయం కూడా వర్తిస్తుందన్నారు.ఆసక్తి అర్హత కలిగిన రైతులు 95055 09988 నెంబర్ కు కాల్ చేసి నవంబర్ 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ఇందుకు నమోదు చేసుకున్న వారిలో 25 మందిని ఎంపిక చేసి కాటారం ప్రాంతంలో శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ రైతులకు అదనపు ఆదాయం తీసుకువస్తుందని కాటారం ప్రాంతంలోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వం తేనె తీగల పెంపకంపై అందజేసే శిక్షణ కార్యక్రమాల్లో ఎంతోమంది రైతులు పాల్గొని శిక్షణ పొంది స్వయం ఉపాధి కల్పించుకొని రాణిస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.